అన్వేషించండి

Infosys Expansion: హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ - కొత్తగా 17 వేల ఐటీ ఉద్యోగాలు, అమెజాన్ భారీ పెట్టుబడులు

CM Revanth Reddy: ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ భాగ్యనగరంలో తమ క్యాంపస్‌ను మరింత విస్తరించనుంది. రూ.750 కోట్లతో మొదటి దశ విస్తరణ చేపడతామని.. కొత్తగా 17 వేల ఉద్యోగాలు రానున్నట్లు తెలిపింది.

Infosys Campus Expansion In Hyderabad: ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) హైదరాబాద్‌లో తమ క్యాంపస్‌ను విస్తరించనుంది. పోచారంలో ఉన్న ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో అదనంగా 17 వేల ఉద్యోగాలు కల్పించనున్నట్లు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకు అనుగుణంగా అక్కడున్న సదుపాయాలు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ జయేష్ సంగ్రాజ్‌తో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు సమావేశమయ్యారు. అనంతరం ప్రకటన విడుదల చేశారు.

ఈ ఒప్పందంలో భాగంగా ఫస్ట్ ఫేజ్‌లో ఇన్ఫోసిస్ సంస్థ రూ.750 కోట్ల పెట్టుబడితో కొత్త ఐటీ భవనాల నిర్మాణం చేపడుతుంది. వచ్చే రెండు, మూడేళ్లలో ఈ నిర్మాణం పూర్తవుతుంది. ఈ కొత్త సెంటర్ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న ఐటీ పర్యావరణ వ్యవస్థకు గణనీయంగా దోహదపడుతుంది. దేశంలో ప్రముఖ ఐటీ గమ్యస్థానంగా తెలంగాణ ప్రతిష్టను మరింత పెంచుతుంది. ఇప్పటికే ఇన్ఫోసిస్ హైదరాబాద్‌లో (Hyderabad) దాదాపు 35,000 మంది ఉద్యోగులున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకోవటం కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతుందని, ఇప్పుడున్న ఐటీ సమూహాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉమ్మడి దృక్పథాన్ని ప్రతిబింబిస్తుందని జయేష్ సంగ్రాజ్ అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేసే లక్ష్యంతో అన్ని రంగాల్లో ప్రముఖ సంస్థలు, పారిశ్రామిక దిగ్గజాలకు ప్రభుత్వం తగినంత మద్దతు ఇస్తుందని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.

అమెజాన్ భారీ పెట్టుబడులు

అటు, తెలంగాణలో భారీ పెట్టుబడికి దిగ్గజ సంస్థ అమెజాన్ ముందుకొచ్చింది. దావోస్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైకేల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రూ.60 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ అంగీకారం తెలిపింది. ఈ మేరకు ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వంతో జరగ్గా.. రాష్ట్రంలో డేటా సెంటర్లను సంస్థ విస్తరించనుంది. వీటికి అవసరమైన భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది.

పెట్టుబడుల సమీకరణలో సరికొత్త రికార్డు

దావోస్‌లో పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ సరికొత్త రికార్డులు నెలకొల్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలో భారీ పెట్టుబడుల రికార్డు నమోదు చేసింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో ఇప్పటికే  రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించింది. గతేడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి రూ.40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అప్పటితో పోలిస్తే ఈసారి  మూడింతలకు మించిన పెట్టుబడులు రావటం విశేషం. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సారథ్యంలో తెలంగాణ రైజింగ్ బృందం దావోస్‌లో వివిధ పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశాలన్నీ విజయవంతమయ్యాయి. హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమివ్వటం ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలను అమితంగా ఆకట్టుకుంది. 

దీంతో పాటు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, మెట్రో విస్తరణకు ప్రభుత్వం ఎంచుకున్న భవిష్యత్తు ప్రణాళికలు పెట్టుబడుల వెల్లువకు దోహదపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న తెలంగాణ రైజింగ్ 2050 విజన్ గేమ్ ఛేంజర్‌గా నిలిచింది. అన్ని రంగాలకు అనుకూలమైన వాతావరణమున్న హైదరాబాద్ గ్రేటర్ సిటీ పెట్టుబడుల గమ్యస్థానంగా మరోసారి ప్రపంచానికి చాటిచెప్పినట్లయింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సరళతర పారిశ్రామిక విధానంతో పాటు ఇటీవల ప్రకటించిన క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ ప్రపంచ పారిశ్రామికవేత్తలను దృష్టిని ఆకర్షించింది. దేశ విదేశాలకు చెందిన పేరొందిన 10 ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఐటీ, ఏఐ, ఇంధన రంగాల్లో అంచనాలకు మించినట్లుగా భారీ పెట్టుబడులను సాధించింది. దావోస్‌లో వరుసగా మూడు రోజుల పాటు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులతో పాటు రాష్ట్రంలో దాదాపు 46 వేల మంది యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి.

Also Read: Telangana News: పటాన్ చెరు కాంగ్రెస్‌లో లొల్లి- మహిపాల్‌ రెడ్డికి వ్యతిరేకంగా రోడ్డెక్కిన కాట శ్రీనివాస్ గౌడ్ వర్గీయులు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RBI Repo Rate:రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
Putin Visit to India: రష్యాలో నిషేధించడానికి చూసిన భగవద్గీతను పుతిన్‌కు గిఫ్టుగా ఇచ్చిన ప్రధాని మోదీ!
రష్యాలో నిషేధించడానికి చూసిన భగవద్గీతను పుతిన్‌కు గిఫ్టుగా ఇచ్చిన ప్రధాని మోదీ!
Pullela Gopichand Badminton Academy in Amaravati: అమరావతిలో బాడ్మింటన్ అకాడమీ!భూమి పూజ చేసిన పుల్లెల గోపీచంద్
అమరావతిలో బాడ్మింటన్ అకాడమీ!భూమి పూజ చేసిన పుల్లెల గోపీచంద్
Akhanda 2: ‘హిందూ మతం’ -  ‘సనాతన హైందవ ధర్మం’.. రెండూ వేరు వేరా?
‘హిందూ మతం’ -  ‘సనాతన హైందవ ధర్మం’.. రెండూ వేరు వేరా?
Advertisement

వీడియోలు

PM Modi Protocol Break at Putin Welcome | రష్యా అధ్యక్షుడికి ఆత్మీయ ఆలింగనంతో మోదీ స్వాగతం | ABP Desam
Akhanda 2 Premieres Cancelled | భారత్ లో నిలిచిన బాలకృష్ణ అఖండ 2 ప్రీమియర్స్ | ABP Desam
Indigo Airlines Issue | ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ఇండియో ఎయిర్‌లైన్స్ | ABP Desam
Rupee Record Fall | ఘోరంగా పతనమవుతున్న రూపాయి విలువ | ABP Desam
సారీ రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్ కప్ పోయినట్లే!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RBI Repo Rate:రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
Putin Visit to India: రష్యాలో నిషేధించడానికి చూసిన భగవద్గీతను పుతిన్‌కు గిఫ్టుగా ఇచ్చిన ప్రధాని మోదీ!
రష్యాలో నిషేధించడానికి చూసిన భగవద్గీతను పుతిన్‌కు గిఫ్టుగా ఇచ్చిన ప్రధాని మోదీ!
Pullela Gopichand Badminton Academy in Amaravati: అమరావతిలో బాడ్మింటన్ అకాడమీ!భూమి పూజ చేసిన పుల్లెల గోపీచంద్
అమరావతిలో బాడ్మింటన్ అకాడమీ!భూమి పూజ చేసిన పుల్లెల గోపీచంద్
Akhanda 2: ‘హిందూ మతం’ -  ‘సనాతన హైందవ ధర్మం’.. రెండూ వేరు వేరా?
‘హిందూ మతం’ -  ‘సనాతన హైందవ ధర్మం’.. రెండూ వేరు వేరా?
Putin: పుతిన్ ని 'డెస్టినీ డ్రివెన్' నాయకుడు అని ఎందుకంటారు? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆ పేరు ఎందుకు పవర్ ఫుల్?
పుతిన్ ని 'డెస్టినీ డ్రివెన్' నాయకుడు అని ఎందుకంటారు? జ్యోతిష్యం ప్రకారం ఆ పేరు ఎందుకు పవర్ ఫుల్?
PDS Rice Illegal transport: పీడీఎస్ బియ్యం అక్ర‌మ ర‌వాణాకు పడని బ్రేక్‌! ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో రెచ్చిపోతున్న‌ రేష‌న్ రైస్‌ మాఫియా!
పీడీఎస్ బియ్యం అక్ర‌మ ర‌వాణాకు పడని బ్రేక్‌! ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో రెచ్చిపోతున్న‌ రేష‌న్ రైస్‌ మాఫియా!
Putin in India: ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
Dies Irae OTT : ఓటీటీలోకి 'A' రేటెడ్ హారర్ థ్రిల్లర్ 'డీయస్ ఈరే' - తెలుగులోనూ చూసెయ్యండి
ఓటీటీలోకి 'A' రేటెడ్ హారర్ థ్రిల్లర్ 'డీయస్ ఈరే' - తెలుగులోనూ చూసెయ్యండి
Embed widget