Nara Lokesh Davos Interview | దావోస్ సదస్సుతో ఏపీ కమ్ బ్యాక్ ఇస్తుందన్న లోకేశ్ | ABP Desam
ఈ సారి దావోస్ పర్యటన...ఏపీకి కమ్ బ్యాక్ అని చెప్పొచ్చు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి ఆంధ్రప్రదేశ్ ఎంత అనువైన చోటో చెప్పటానికి ప్రయత్నించాం. గడచిన ఆరేడేళ్లుగా మేం ఎలాంటి ప్రాజెక్టులను ఏపీలో ల్యాండ్ చేశామో చూసుకోవచ్చు. అలాంటి ప్రాజెక్టులు మరే రాష్ట్రంలోనూ రాలేదు. ఇండియాలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ కట్టడానికి ఒప్పందం చేసుకున్నాం. అతిపెద్ద డేటా సెంటర్ ఏపీలో ఏర్పాటు చేస్తున్నాం. టీసీఎస్ కొత్త క్యాంపస్ ను ఏపీలో ఏర్పాటు చేస్తోంది. బీపీసీఎల్ కొత్త రిఫైనరీని ఏపీలో పెడుతోంది. ఎన్టీపీసీ దేశంలోనే అతి పెద్ద హైడ్రోజన్ హబ్ ను మా రాష్ట్రంలో పెడుతోంది. బలమైన రాష్ట్రాలే బలమైన దేశానికి కారణం అవుతాయి. దేశంలోనే ముందుండాలని మేం కష్టపడుతున్నాం.
మన దేశం డబుల్ డిజిట్ గ్రోత్ ఈజీగా సాధిస్తుందని నమ్ముతున్నాను. కావాల్సిందల్లా రాష్ట్రాలన్నీ కలిసి వికసిత్ భారత్ కోసం కష్టపడతమే. మన దేశంలో ఇలాంటి సదస్సులు చాలానే పెడుతున్నాం. గ్లోబల్ లీడర్స్ కూడా వస్తున్నారు. కానీ దావోస్ తో వాటిని కంపేర్ చేయలేం. ఇది ప్రత్యేకమైనది. మనం పెట్టే సదస్సులో పెట్టుబడులే కాకుండా టాలెంట్ ను ఎంకరేజ్ చేయటం, కల్చర్ ను ప్రమోట్ చేయటం లాంటివి చేస్తుంటాం.
అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చారు. హెచ్ బీ1 పాలసీని మార్చరని ఆశిస్తున్నా. ఇప్పుడేవో పరిస్థితులు అటూ ఇటూ ఉన్నట్లున్నాయి. ఇంకా పూర్తి నిర్ణయాలు తీసుకోలేదు కాబట్టి మనం కాస్త వేచి చూడాలి. ఏపీలో అయితే పెట్టుబడుల కోసం మంచి అవకాశాలు కల్పిస్తున్నాం. విశాఖను ఐటీ రాజధానిగా తీర్చిదిద్దుతాం.





















