Ram Gopal Varma Convicted Jail | సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీకి జైలు శిక్ష | ABP Desam
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు షాక్ తగిలింది. ఊహించనిరీతిలో రామ్ గోపాల్ వర్మకు జైలు శిక్ష పడింది. వాస్తవానికి రీసెంట్ గా ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ కు సంబంధించి ఆర్జీవీ పోలీస్ నోటీసులు అందుకుని విచారణకు వెళ్లకుండా తిరుగుతుండగా..ఇప్పుడు మరో చోట నుంచి రామ్ గోపాల్ వర్మకు చుక్కైదురైంది. ఏడేళ్ల కిందటి ఓ కేసులో ముంబైలోని అంథేరీ మెజిస్ట్రేట్ కోర్టు ఆర్జీవీకి మూడు నెలల జైలు శిక్ష విధించింది. రాంగోపాల్ వర్మపై ముంబైలో 2018లో చెక్‌బౌన్స్ కేసు నమోదైంది. అప్పట్లో మహేష్‌చంద్ర మిశ్రా అనే వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరుతో రాంగోపాల్ వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే గత ఏడేళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో కోర్టుకు పలుమార్లు హాజరుకావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ.. వర్మ ఒక్కసారి కూడా కోర్టుకు వెళ్లలేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు ఆర్జీవీపై కన్నెర్ర చేసింది. అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వచ్చే మూడు నెలల్లో ఫిర్యాదు దారుడికి రూ.3.72 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఒకవేళ పరిహారం చెల్లించడంలో విఫలమైతే 3 నెలల పాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెల్లడించింది.




















