అన్వేషించండి

Podharillu Serial Today March 3rd: మాధవ్‌పై చక్రి చేయిచేసుకోవడానికి కారణమేంటి..? ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న మహా ఏం చేసింది..?

Podharillu Serial Today Episode March 3rd: మాధవ్‌ ఆర్కిటెక్‌ కాదని మహాలక్ష్మీ కి తెలిసిపోయిందా...? శైలూ దగ్గర నుంచి కేశవ్ ఫోన్ ఎలా కొట్టేశాడు...?

Podharillu Serial Today Episode: మహాకు నిజం చెప్పి గొడవకు కారణమవ్వడానికి కారణమైన మాధవ్‌పై చక్రి చాలా కోపంగా ఉంటాడు. ఒంటరిగా ఇంటికి చేరిన చక్రిని కేశవ్‌తోపాటు మాధవ్‌ నిలదీస్తారు. మహాలక్ష్మీ ఎక్కడని ప్రశ్నిస్తారు. దీంతో చక్రి వాళ్లపై మండిపడతాడు. నిజం చెప్పిన సత్యహరిశ్చంద్రుడిని అడుగు అంటూ కోపగించుకుంటాడు. నువ్వు అబద్ధాలు చెప్పి మోసం చేసి...అన్నయ్యపై అరుస్తున్నావేంటిరా  అంటూ కేశవ్‌ మండిపడతాడు. మీ అందరికీ నేనంటే అసూయని....మీ అందిరికీ పెళ్లిళ్లు కాకుండా ఇంట్లోనే పడి ఏడుస్తున్నారని, నేను కూడా మీలాగే ఉండిపోకుండా పెళ్లి చేసుకున్నానని మీ అందరికీ కుల్లు అని చక్రి మండిపడతాడు. అందుకే మా ఇద్దరినీ విడదీయడానికి చూస్తున్నారని అంటాడు. ఆ మాటలకు కేశవ్‌కు తీవ్ర ఆగ్రహం వస్తుంది. దీంతో చక్రిపై  తిరగబడతాడు. ఇద్దరూ కొట్టుకుంటుంటే....మాధవ్‌ విడదీయడానికి ప్రయత్నిస్తాడు.
 
ఇంతలో మహాను తీసుకుని కన్నా ఇంటికి వస్తూ దారిలో అడుగుతాడు. చక్రి అబద్ధాలు చెప్పాడని కోపంగా ఉందా అని అంటాడు. వాడు మా గురించి గొప్పలు చెప్పాలని అబద్ధం చెప్పి ఉంటాడు కానీ...మోసం చేసే ఉద్దేశం వాడికి ఉండదని చాలా మంచొడని చెబుతాడు. నువ్వు అనవసరంగా చక్రిని అపార్థం చేసుకోవద్దు వదినా అని అంటాడు. వాళ్లిద్దరూ ఇంటికిచేరే సరికి చక్రి, కేశవ్ గొడవపడుతుంటారు.  ఆ కోపంలో చక్రి కేశవ్‌ను కొట్టబోతుండగా...మాధవ్‌ అడ్డురావడంతో  మాధవ్‌ చెంపపై గట్టిగా కొడతాడు. అప్పుడే ఇంట్లోకి వచ్చిన కన్నా,మహా ఆ దృశ్యం చూసి షాక్‌కు గురవుతారు. దీంతో చక్రిపై కోపంతో కేశవ్‌ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోగా....కన్నా చక్రిపై మండిపడతాడు. దేవుడిలాంటి అన్నయ్యపై చేయిచేసుకుంటావా అని నిలదీస్తాడు.
   
మహాలక్ష్మీని చూసి నువ్వు ఇప్పటి వరకు ఇంటికి రాలేదన్న బాధలోనే ఇంట్లో చిన్న గొడవ జరిగిందని, చిన్నప్పటి నుంచి చక్రి, కేశవ్‌కు ఇది అలవాటేనని నువ్వు ఏం పట్టించుకోవద్దని మాధవ్‌ ఆమెకు చెప్పి...వెళ్లి రెస్ట్‌ తీసుకోమని చెప్పి వంటగదిలోకి వెళ్లిపోతాడు. కన్నా అక్కడికి వచ్చి చక్రి అన్నయ్య నీమీద చేయి ఎందుకు చేసుకున్నాడని నిలదీస్తాడు. వాడు అసలు నన్ను కొట్టలేదని...కేశవ్‌ను కొట్టబోతుండగా నేను మధ్యలో వెళ్లేసరికి నాకు చేయి తగిలిందని చెబుతాడు. మరి కనీసం సారీ కూడా చెప్పలేదని అంటే...కావాలంటే నువ్వు వెళ్లి చూడు మనకన్నా వాడే చాలా బాధపడుతుంటాడని చెబుతాడు.అప్పుడే  అక్కడికి వచ్చిన మహా మాధవ్‌కు సారీ చెబుతుంది.  నావల్లే మీమధ్య గొడవలు వచ్చాయని అంటుంది.అలాంటిదేమీ  లేదని మాధవ్‌ ఆమెకు సర్ధిచెబుతాడు.
 
అన్నయ్యపై చేయిచేసుకున్నందుకు చక్రి చేతికి గాయం చేసుకుని బాధపడుతుంటాడు. అక్కడికి వెళ్లిన మాధవ్‌ ఇలాంటి పిచ్చిపనులు ఎందుు చేస్తున్నావని మండిపడతాడు. చిన్నప్పటి నుంచి తోటి పిల్లలు ఏడిపిస్తుంటే...మన ఇంటి గురించి చెప్పడం ఇష్టం లేక అబద్ధాలు చెబుతుండేవాడినని...మీ గురించి కూడా గొప్పలు చెప్పడం అలా అలవాటు అయ్యిందని  చెబుతాడు. నేను ప్రతిరోజూ చాలా గొప్పగొప్ప వాళ్లను నా కారులో ఎక్కించుకుని తిప్పుతుంటానని....వాళ్ల ముందు మిమ్మల్ని తక్కువ చేసి చూపడం సరిగాక అలా అబద్ధాలు చెప్పడం అలవాటు అయ్యింది తప్ప...నాకు ఎవరినీ మోసం చేసే ఉద్దేశం లేదని చెబుతాడు. అదే విధంగా మహాకు కూడా మీ గురించి అబద్ధాలు చెప్పానే తప్ప...మోసం చేయాలని అనుకోలేదని అంటాడు. ఇకపై అబద్ధాలు చెప్పడం మానేస్తానని చెబుతాడు.
 
ఉదయం తమ ఇంటి ఆవరణలో కొబ్బరిబోండాలు  కోసుకుంటున్న వ్యక్తిపై నారాయణ కత్తితో బెదిరిస్తాడు. అది చూసిన మహాకు గుడిలో తాయరు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి బెంబేలెత్తిపోతుంది.ఇక ఈ ఇంట్లో ఉండటం అంత మంచిది కాదనుకుని బయటకు వెళ్లి అద్దె ఇల్లు చూసుకుని అడ్వాన్స్‌ ఇచ్చి వస్తుంది.

 

 

 

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 15th: 'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
Nindu Manasulu Serial Today August 15th: నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
Gundeninda Gudigantalu August 15th:మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
గుండెనిండా గుడిగంటలు: మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
Podarillu Serial Today August 15th:చక్రితో ఒడిబియ్యం పోయించుకున్న మహా...పున్నమి పూజ కోసం సిద్ధమైన మహాలక్ష్మీ.
పొదరిల్లు: చక్రితో ఒడిబియ్యం పోయించుకున్న మహా...పున్నమి పూజ కోసం సిద్ధమైన మహాలక్ష్మీ

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
Embed widget