అన్వేషించండి

Chandrababu Team Davos: ఎంవోయూలు చేసుకోకుండానే దావోస్ టూర్ ముగింపు - చంద్రబాబు, లోకేష్ వ్యూహం మార్చారా ?

Davos: దావోస్‌లో ఏపీ బృందం ఒక్క ఎంవోయూ చేసుకోలేదు. పెట్టుబడుల ఒప్పందాలు రాష్ట్రంలోనే చేసుకోవాలన్న ఉద్దేశంతో ఒప్పందాలు చేసుకోలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Chandrababu team turned back without making MOUs in Davos why:  దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వం గత రికార్డులను అధిగమించి లక్షన్నర కోట్లకుపైగా పెట్టుబడులు సాధించామని ప్రకటించుకుంది. రికార్డులు బద్దలయ్యాయని సంచలనం సృష్టించామని చెప్పుకున్నారు. అయితే పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రం ఒక్క ఎంవోయూ కూడా చేసుకోలేదు. దావోస్ పర్యటనలో చంద్రబాబు, లోకేష్ కొత్త ఒరవడి సృష్టించారు. 

గతంలో చంద్రబాబు దావోస్ ఎప్పుడు వెళ్లినా వేలు, లక్షల కోట్ల ఒప్పందాలు అంటూ హడావడి జరిగేది. కానీ ఈ సారి మాత్రం  ఎలాంటి ముందస్తు ఒప్పందాలు చేసుకోలేదు. పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్ అనుకూలతల గురించి ప్రజెంటేషన్ ఇవ్వడం. తమ రాష్ట్రానికి వచ్చి క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని కోరడానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఓ రకంగా పూర్తి స్థాయిలో మార్కెటింగ్ మీదనే దృష్టిపెట్టారని అనుకోవచ్చు. బిల్ గేట్స్ వరకూ దావోస్‌కు వచ్చిన దిగ్గజ పారిశ్రామికవేత్తలందర్నీ చంద్రబాబు,లోకేష్ కలిశారు. విస్తృతంగా సెమినార్లలో పాల్గొన్నారు. ఏపీలో ఉన్న అవకాశాల్ని వివరించారు.    

Also Read: రాజకీయాల్లో వారసత్వం ఓ భ్రమ - లోకేష్ నాయకత్వంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

దావోస్‌ సదస్సు పూర్తిగా పెట్టుబడిదారులు, ఆ పెట్టుబడులను ఆకర్షించాలనుకునేవారికి మధ్య ఓ వారధి లాంటిది. అనేక దేశాల్లో ఉన్న అవకాశాలను అక్కడ ప్రజెంట్ చేసుకునే అవకాశం  ఇక్కడ లభిస్తుంది. అయితే అక్కడ వచ్చే టాప్ ఎగ్జిక్యూటివ్స్ ..  ప్రభుత్వాలకు చెందిన వారితో మాట్లాడి వెంటనే ఒప్పందాలు చేసుకోవడం అనేది అసహజం అనుకోవచ్చు. అప్పటికప్పుడు ఒప్పందాలు చేసుకోవడం అనేది ఉండదు. ముందస్తుగా చర్చలు పూర్తి చేసుకున్న  ఒప్పందాలు ఉంటే అక్కడ పత్రాలు మార్చుకుంటారు.                        

ఓ పారిశ్రామిక సంస్థ అయినా.. ఇలా చంద్రబాబో..లోకేషో మరొకరో అడిగారని ఎంవోయూ చేసుకుంటే..అది వాస్తవ రూపంలోకి వచ్చేందుకు అవకాశం చక్కువగా ఉటుంది.  అందుకే అలాంటి పెట్టుబడులకు దూరంగా ఉండాలని చంద్రబాబు,లోకేష్ నిర్ణయించుకున్నారు. అందుకే పూర్తిగా ఏపీ గురించే చెప్పడానికే ప్రాదాన్యం ఇచ్చారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.  ఏపీలో పెట్టుబడులు పెట్టాలని నిర్మయించుకున్న చాలా కంపెనీలు వాటి టాప్ ఎగ్జిక్యూటివ్స్ దావోస్ వచ్చారు. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ పెట్టాలనుకున్న ఆర్సెలార్ మిట్టల్ యజమాని కూడా దావోస్ వచ్చారు. చంద్రబాబు, లోకేష్ తో సమావేశమయ్యారు. రూ. లక్షన్నర కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వారి ఉన్నాయి. అయితే  తమ ప్రతిపాపనలపై మరోసారి చర్చించారు.అయితే ఆ పెట్టుబడుల ప్రకటనలకు దావోస్ సరైన వేదిక కాదని అనుకున్నట్లుగా తెలుస్తోంది.  

Also Read:  త్వరలో మోదీ కేబినెట్‌లోకి చంద్రబాబు - బ్లూమ్‌బెర్గ్ డౌట్ - సీఎం రియాక్షన్ ఏమిటంటే ?

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
AP Cabinet Decisions: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం స్పష్టత..! ఏ క్షణమైనా నోటిఫికేషన్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం స్పష్టత..! ఏ క్షణమైనా నోటిఫికేషన్

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget