Chandrababu on Lokesh: రాజకీయాల్లో వారసత్వం ఓ భ్రమ - లోకేష్ నాయకత్వంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
CM Chandrababu: రాజకీయాల్లో వారసత్వం ఓ మిత్ అని చంద్రబాబు స్పష్టం చేశారు. వారుసుడిగా లోకేష్ ను రెడీ చేస్తున్నారా అని జాతీయ మీడియా అడిగిన ప్రశ్నకు చంద్రబాబు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

Chandrababu clarified about Lokesh succession : తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత నారా లోకేషేనని ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా తరవాత సీఎం కూడా లోకేషేనని టీడీపీలో అప్పటికే వాయిస్ వినిపించడం ప్రారంభమయింది. ఈ క్రమంలో దావోస్‌లో ఓ జాతీయ మీడియా చానల్ చర్చలో పాల్గొన్న చంద్రబాబునాయుడుకు ... ఇలాంటి ప్రశ్నను యాంకర్ వేశారు. మీరు ముఖ్యమంత్రిగా.. పార్టీ అధ్యక్షుడిగా ఈ తర్వాత మీ అబ్బాయికి నాయకత్వం అందించేలా మీరు అందర్నీ రెడీ చేస్తున్నా చేస్తున్నారనే చర్చ జరుగుతోందని ఇది నిజమేనా అని జర్నలిస్టు ప్రశ్నించారు.
వారసత్వం ఓ భ్రమ - కానీ వారికి కొన్ని అనుకూలతలు
ఈ ప్రశ్నకు చంద్రబాబు సూటిగా సమాధానంచెప్పలేదు. వారసత్వం అనేది ఓ భ్రమ అని.. వ్యాపారం, రాజకీయాలు ఇలా ఎక్కడైనా వారసత్వం వచ్చేస్తుదంని అనుకోలేమన్నారు. కాకపోతే వాళ్లకి కొన్ని అనుకూలతలు ఉంటాయని విశ్లేషించారు. తెలుగుదేశం పార్టీ 45 ఏళ్ల పైగా చరిత్ర కలిగిన పార్టీ అని గుర్తు చేశారు. క్యాడర్ బలంగా ఉండే పార్టీ అన్నారు. ఇప్పుడు టీడీపీ సభ్యుల సంఖ్య కోటి మంది ఉన్నారని.. మేం కార్యకర్తలను నాయకత్వంలో ఎంకరేజ్ చేస్తుంటామన్నారు.
రాజకీయాల్లో సమర్థత చూపిస్తేనే రాణింపు
.
ఒక జనరేషన్ సంపద సృష్టిస్తుంటే.. తర్వాత జనరేషన్ దాన్ని నాశనం చేస్తుంది. బలంగా ఉన్న పార్టీలకు విలువ లేకుండా పోతోందన్నారు. ఒక బలమైన నాయకుడు ఉంటే అది దేశానికి , రాష్ట్రానికి పార్టీకి సంపద ఉంటుందని గుర్తు చేశారు. బలమైన నాయకత్వం వారసత్వం వల్ల రాదన్నారు. అయితే లోకేష్‌కి ఉన్న వాతావరణం వల్ల అతనికి కొన్ని అనుకూలతలు ఉంటాయన్నారు. ఆ అనకూలతను ఉపయోగించుకుని సరిగ్గా పనిచేస్తే విలువ పెంచుకోవచ్చన్నారు. కార్పొరేట్ కంపెనీల్లో సమర్థులైన వారలుసు కంపెనీల విలువ పెంచుతారని అలాగే.. రాజకీయాల్లోనూ సమర్థత చూపిస్తే రాణించవచ్చన్నారు. రాజకీయాల్లోకి ఉపాధి కోసం రాలేదని.. తనకు 33ఏళ్ల క్రితమే బిజినెస్ ఉందని చంద్రబాబు గుర్తు చేశారు.
లోకేష్ ప్రజా సేవ ఎంచుకున్నాడు.. చేయనివ్వండి !
చిన్న ఫ్యామిలీ బిజినెస్ ఇప్పుడు పెరిగి పెద్దదైంది. లోకేష్ ఫ్యామిలీ బిజినెస్ ఏ చూసుకోవాలనుకుంటే అది అతనికి ఈజీ అయ్యేది. కానీ అతను ప్రజలకు సేవ చేయాలనుకున్నాడని.. చేయనివ్వాలని అన్నారు. చంద్రబాబు అభిప్రయం ప్రకారం లోకేష్ విషయంలో ఆయనకు కొన్ని అనుకూలతలు ఉన్నాయి కానీ.. వారుసడిగా ఒక్క సారిగా పదవులపై కూర్చోబెట్టడం అనేది ఉండదు. ఏదైనా సమర్థతతో పని చేసుకుని సాధించుకోవాలని చంద్రబాబు సలహాలిస్తున్నారు. సినీ రంగంలో అయినా.. వ్యాపార రంగంలో అయినా..అన్ని ప్రముఖ కంపెనీల లేకపోతే నేతల..హీరోల వారసులకు అవకాశాలు వస్తాయి కానీ ఎదగరు. కొంత మందే ఎదుగుతారు. అది వారి సమర్థత. లోకేష్ కు కూడా అలాంటి సమర్థత ఉంటే రాజకీయంగా ఎదుగుతారని చంద్రబాబు విశ్లేషించారని అనుకోవచ్చు.
Also Read: త్వరలో మోదీ కేబినెట్‌లోకి చంద్రబాబు - బ్లూమ్‌బెర్గ్ డౌట్ - సీఎం రియాక్షన్ ఏమిటంటే ?





















