Tirupati Pilgrim Stampede CPR | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP Desam
తిరుపతి తొక్కిసలాట ఘటనలో కనిపించిన దృశ్యాలు హృదయ విదాకరంగా ఉన్నాయి. తిరుమల శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకుందామని టోకెన్ల కోసం వచ్చిన భక్తులు ఊహించని లోకాలకు వెళ్లిపోయారు. బైరాగిపట్టెడ లో ఏర్పాటు చేసిన టోకెన్ కౌంటర్ దగ్గర భారీ తొక్కిసలాట జరిగింది. పార్కు లోనుంచి ఒక్కసారిగా బయటకు వచ్చిన భక్తులు టోకెన్ కౌంటర్ లైన్లోకి వెళ్లేందుకు చేసిన యత్నమే తొక్కిసలాటకు కారణమైంది. ఊపిరి అందక కిందపడిపోయిన భక్తులు మిగిలిన భక్తులు తొక్కేయగా...వారిని గమనించిన వారు సీపీఆర్ అందించి ఊపిరి పోసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. బైరాగిపట్టెడలోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఓ పురుషుడు ఉండగా...వాళ్లకు సీపీఆర్ చేసినా శరీరంలో కదలిక లేని దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. మృతుల కుటుంబసభ్యుల రోదనలతో బైరాగిపట్టెడ ప్రాంతమంతా తీవ్ర విషాదాన్ని నిండిపోయింది. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి వారికి అక్కడ మెరుగైన చికిత్స ను అందించేలా టీటీడీ అధికారులు వైద్యులు కలిసి కృషి చేస్తున్నారు.