వరుసగా 3 సంవత్సరాల్లో 3 నందులు అందుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

హీరోయిన్ లయ తన కెరీర్ స్టార్టింగ్​లో వరుసగా మూడుసార్లు నంది అవార్డులు అందుకుంది.

మొదటి సినిమాతోనే స్పెషల్ జ్యూరీలో లయ నంది అవార్డు దక్కించుకుంది.

మొదటి అవార్డు 1999లో అందుకుంది. స్వయంవరం సినిమాకుగానూ ఈ అవార్డు దక్కించుకుంది.

అయితే ఆ సమయంలో వేరే షూటింగ్​లో బిజీగా ఉండడం వల్ల అవార్డును నేరుగా తీసుకోలేకపోయింది.

మనోహరం సినిమాకుగానూ (2000 సంవత్సరంలో) రెండో నంది అవార్డు దక్కించుకుంది.

ప్రేమించు సినిమాలో నటనకు గానూ.. (2001లో) లయ మూడో నంది అవార్డును దక్కించుకుంది.

2000, 2001 రెండు సంవత్సరాలకు నేరుగా ఒకేసారి రెండు అవార్డులు అందుకుంది.

తరువాత ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. హీరోయిన్​గా మంచి ఆఫర్లు అందుకుంటున్న సమయంలో పెళ్లి చేసుకుంది.

ఇద్దరు పిల్లలతో భర్తతో కలిసి యూఎస్​లో లైఫ్​ని లీడ్ చేస్తోంది లయ. (Images Source : Instagram/layagorty)