బడేమియా ఛోటేమియా, మైదాన్ సినిమాలు ఏప్రిల్ 10వ తేదీన విడుదల అయ్యాయి. ఎల్ఎస్‌డీ 2, దో అవుర్ దో ప్యార్ సినిమాలు ఏప్రిల్ 19వ తేదీన రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాల మధ్య ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద గట్టిపోటీ నడుస్తోంది. కానీ ఇవేవీ స్థాయికి తగ్గట్లు వసూళ్లు సాధించడం లేదు. రూ.350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన బడేమియా ఛోటేమియా ఇంకా రూ.100 కోట్ల మార్కును కూడా చేరలేదు. రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన మైదాన్ రూ.32 కోట్ల వద్దే ఉంది. బడ్జెట్‌తో పోలిస్తే ఈ వసూళ్లు చాలా తక్కువ. రూ.13 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన దో అవుర్ దో ప్యార్ సినిమా రెండు రోజుల్లో రూ.1.4 కోట్లు వసూలు చేసింది. పాజిటివ్ టాక్‌తో కూడా మైదాన్ ఫ్లాప్ లిస్ట్‌లో చేరేలా కనిపిస్తుంది. ఇక బడేమియా ఛోటేమియా అయితే బాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలవనుందని అంచనా.