అన్వేషించండి

Soup for Weight Loss : బరువును తగ్గించే హెల్తీ సూప్.. డిన్నర్​కి పర్​ఫెక్ట్​ రెసిపీ

Tasty Dinner Recipe : సమ్మర్ వచ్చిందంటే చాలామంది రాగితో చేసిన ఫుడ్​ని తీసుకుని వివిధ రూపాల్లో తీసుకుంటారు. మీరు కూడా ఆరోగ్య ప్రయోజనాల కోసం దీనిని తీసుకోవాలనుకుంటే మంచి సూప్ తయారు చేసుకోవచ్చు. 

Ragi Soup for Weight Loss : రాగిపిండి అనగానే మనకి గుర్తొచ్చేది సంగటి, జావా. చాలామంది వీటిని ఇష్టంగా తీసుకుంటారు. మరికొందరు ఆరోగ్య ప్రయోజనాల కోసం వీటిని ఎక్కువగా తమ డైట్​లో చేర్చుకుంటారు. ముఖ్యంగా సమ్మర్​లో వేడిని తగ్గించుకోవడం కోసం రాగిపిండిని వివిధ వంటకాల రూపంలో తీసుకుంటారు. ఇది చలువ చేస్తుందని.. వివిధ ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందని అంటారు. మీరు కూడా రాగిని మీ డైట్​లో చేర్చుకోవాలనుకుంటే.. డిన్నర్​కోసం రాగితో తయారు చేసిన సూప్​ని మీరు ట్రై చేయవచ్చు. 

మీరు బరువుతగ్గాలనే ప్లాన్​తో ఉంటే రాగి సూప్ మీకు మంచి డిన్నర్​ అవుతుంది. అంతేకాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. కేవలం హెల్త్​ బెనిఫిట్స్ మాత్రమే కాకుండా టేస్ట్​లో కూడా మీకు మంచి అనుభూతిని ఇస్తుంది. మరి ఈ హెల్తీ డిన్నర్ రెసిపీని ఏవిధంగా తయారు చేయాలి? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు 

రాగిపిండి - 1 కప్పు

ఉల్లిపాయ -1 

క్యారెట్లు - 2

పాలకూర - అరకప్పు

బీన్స్ - అరకప్పు

క్యాబేజీ - అరకప్పు

స్వీట్ కార్న్- అరకప్పు

అల్లం - అంగుళం

వెల్లుల్లి - 2 రెబ్బలు

నీళ్లు - 4 కప్పులు

నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్స్

నెయ్యి - సూప్​కి తగినంత

ఉప్పు - రుచికి తగినంత

మిరియాలు - చిటికెడు పొడి

కొత్తిమీర - గార్నిష్ కోసం

తయారీ విధానం

ముందుగా కూరగాయలను సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లి, అల్లం కూడా చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై ఓ పెద్ద గిన్నె పెట్టండి. దానిలో నెయ్యి వేసి వేడి చేయండి. ఇప్పుడు దానిలో అల్లం, వెల్లుల్లి తురుము వేసి వేయించండి. అవి కాస్త వేగిన తర్వాత దానిలో ఉల్లిపాయలు వేయండి. అవి వేగిన తర్వాత.. ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, క్యాబెజీ, బీన్స్, స్వీట్ కార్న్ వేసి మూతపెట్టండి.

కూరగాయలు ఉడికిన తర్వాత దానిలో నాలుగు కప్పుల నీరు వేసి బాగా కలపండి. అనంతరం దానిలో ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపండి. ఇప్పుడు అవి మరిగేవరకు స్టౌవ్​ను మీడియం ఫ్లేమ్​ మీద ఉంచాలి. ఇప్పుడు ఓ గిన్నె తీసుకుని దానిలో రాగిపిండిని, నీటిని వేసుకుని బాగా కలపాలి. ఉండలు లేకుండా కలిపిన మిశ్రమాన్ని పక్కనపెట్టుకోండి. కూరగాయలు ఉడికి.. బాగా బాయిల్ అవుతున్న సమయంలో కలిపి పెట్టుకున్న రాగిపిండిని వేయాలి. ఇది వేస్తున్నంత సేపు గరిటెతో తిప్పుతూనే ఉండాలి. అప్పుడే అది ఉండలు లేకుండా మంచిగా సిద్ధమవుతుంది. 

ఇప్పుడు రాగిపిండి ఉడికేవరకు మంటను చిన్నగా చేసి ఉడికించాలి. అనంతరం స్టౌవ్ ఆపేసి దానిలో నిమ్మరసం వేసి బాగాకలపండి. చివరిగా కొత్తమీరతో ఈ సూప్​న గార్నిష్ చేయవచ్చు. దీనిని రాత్రి సమయంలో మీ డిన్నర్​గా తీసుకోవచ్చు. ఉదయాన్నే తీసుకున్నా కూడా మంచిదే. అంతేకాకుండా ఈ ఒక్కసూప్​తో ఎన్నో హెల్ప్ బెనిఫిట్స్ మీ సొంతమవుతాయి. బరువు తగ్గడంలో ఈ సూప్ బాగా పనిచేస్తుందని నిపుణులు చెప్తున్నారు. దీనిలోని వెజిటేబుల్స్ మీ శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ హెల్తీ రెసిపీని తయారు చేసుకుని హాయిగా లాగించేయండి. 

Also Read : ఆ సమస్యలున్నవారు కరివేపాకుతో ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు.. జుట్టుకైతే బోలేడు బెనిఫిట్స్ 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారుఎడతెరపి లేకుండా వర్షం, డ్రాగా ముగిసిన గబ్బా టెస్ట్అలిగిన అశ్విన్, అందుకే వెళ్లిపోయాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Prasad Behara Arrest: నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
Telangana TET Exam Dates: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
DHOP Song Promo: ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!
ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!
Allu Arvind: శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
Embed widget