అన్వేషించండి

Dinner Mistakes to Avoid : బరువు తగ్గాలనుకుంటే డిన్నర్​లో ఈ మిస్టేక్స్ చేయకపోవడమే మంచిది.. లేదంటే ఇట్టే పెరిగిపోతారట

Weight Gain Prevention : తెలియకుండా చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల బరువు పెరిగిపోతూ ఉంటారు. అందుకే డిన్నర్ విషయంలో కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు. ఇంతకీ ఆ మిస్టేక్స్ ఏంటంటే?

Dinner Mistakes for Weight Gain : బరువు తగ్గడం చాలా కష్టమని భావిస్తూ ఉంటారు. అయితే తెలియకుండా లేదా పర్లేదులే అని చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల బరువు పెరుగుతామని అంటున్నారు నిపుణులు. అలాగే డిన్నర్ సమయంలో చేసే కొన్ని తప్పుల వల్ల బరువు పెరుగుతారట. ఇవి చాలా కామన్, సింపుల్ అనుకుంటారు కానీ.. వీటిని ఇగ్నోర్ చేయకపోతే మీరు బరువు తగ్గాలనే గోల్​కి చెక్​ పెట్టేయడమే బెటర్ అంటున్నారు నిపుణులు. ఇంతకీ డిన్నర్ సమయంలో చేసే మిస్టేక్స్ ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. 

బరువు తగ్గాలంటే బ్రేక్​ఫాస్ట్​ ఇవి తీసుకోవాలని చెప్తారు కానీ.. డిన్నర్ విషయం గురించి అంతగా చెప్పారు. మధ్యాహ్నాం మీల్స్​లో ఉన్నట్టే డిన్నర్ విషయంలో కూడా కొన్ని ఫాలో అవ్వాలట. అయితే డిన్నర్​లో ఏమి తినాలి.. ఏమి తినకూడదు.. ఏ టైమ్​లో తినొచ్చో.. ఎంత తినొచ్చో వంటి విషయాలపై కచ్చితంగా అవగాహన ఉండాలి అంటున్నారు. లేదంటే ఇవి మీరు బరువు పెరగడానికి దారి తీస్తాయంటున్నారు. 

ఎక్కువగా తినడం..

ఆఫీస్​ నుంచి రిలాక్స్ అవుతున్నామనుకుని.. టేస్టీగా ఫుడ్ ఉంది.. ఇప్పుడు పనేమి లేదనుకుని చాలామంది ఎక్కువగా తినేస్తారు. డిన్నర్ సమయంలో ఎక్కువ మీల్స్ అస్సలు తీసుకోకూడదు. దీనివల్ల జీవక్రియ మందగిస్తుంది. మెటబాలీజం ఎక్కువగా ఉంటే బరువు తగ్గుతారు. కానీ తక్కువగా ఉంటే బరువు పెరిగిపోతూ ఉంటారు. అందుకే సలాడ్స్, సూప్​లు, వెజిటేబుల్స్​ వంటివి తీసుకుంటే మంచిది. ఇవి బరువును తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. 

ఆలస్యంగా తినడం..

వివిధ కారణాల వల్ల చాలా మంది డిన్నర్​ను ఆలస్యంగా చేస్తారు. అయితే లేట్​ నైట్​ భోజనం చేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదంటున్నారు. అలాగే బరువును వేగంగా పెంచుతుందని చెప్తున్నారు. ఫాస్టింగ్ ఎక్కువ సయమం ఉంటే కొవ్వు కరుగుతుంది కానీ.. తక్కువ సమయం ఉంటే చెడు కొవ్వు పెరిగి బరువు పెరుగుతారు. కాబట్టి వీలైనంత త్వరగా డిన్నర్ చేయడానికి ట్రై చేయండి. 

ఫుడ్ కేలరీలు..

రాత్రి సమయంలో కేలరీలు ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకుంటే బరువు పెరుగుతారు. అధిక కేలరీల తీసుకుంటే బరువు పెరిగిపోతారు కాబట్టి వీలైనంత వరకు లో కేలరీ ఫుడ్స్ తీసుకోవాలి అంటున్నారు. చిన్న ప్లేట్​లో ఫుడ్ తింటే ఎక్కువ తిన్న ఫీలింగ్ వస్తుందని చెప్తున్నారు.

అవి కచ్చితంగా ఉండాలి..

తీసుకునే ఆహారంలో ప్రోటీన్, ఫైబర్ కచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇవి బరువును తగ్గించడంలో కీలకంగా ఉంటాయి. కాబట్టి ఈ పోషకాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దంటున్నారు. కార్బోహైడ్రేట్లు, కొవ్వులతో నిండిన ఆహారాన్ని వీలైనంతవరకు తగ్గించుకుంటే మంచిదని చెప్తున్నారు. పైగా ఫైబర్, ప్రోటీన్ ఎక్కువకాలం కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. కాబట్టి ఇవి మంచి ఆప్షన్. 

ఉప్పును తగ్గించండి.. 

ఉప్పును ఎక్కువగా తీసుకుంటున్నారా? అయితే మీరు బరువు పెరగడంలో ఇది కూడా ఓ ప్రధాన కారణమవుతుంది. ఎందుకంటే ఇది శరీరంలో నీటిని నిల్వ చేస్తుంది. దీనివల్ల బరువు పెరుగుతారు. ఈ సమస్యను నివారించుకోవాలంటే.. ఉప్పును తీసుకోవడాన్ని కంట్రోల్ చేయాలి. 

వాటి జోలికి వెళ్లొద్దు

పుల్లటి ఆహారాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. రాత్రి సమయంలో వీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు డైటీషియన్లు. వెనిగర్, సాంబార్, పుల్లని సూప్స్, ఫుడ్స్ నీటిని శరీరంలో ఉంచుతాయి. వీటి వల్ల బరువు పెరుగుతారు. అందుకే పులుపు, ఉప్పు లేకుండా ఉండే ఫుడ్ తీసుకోండి. 

ఈ మిస్టేక్స్​ని చాలా తక్కువ అంచనా వేస్తారు కానీ.. ఇవి బరువును ఈజీగా పెంచేస్తాయి. కాబట్టి వీటికి వీలైనంత దూరంగా ఉండాలని చెప్తున్నారు నిపుణులు. 

Also Read : వర్షాకాలంలో ఈ సూప్​ డిన్నర్​గా తీసుకుంటే చాలామంచిది.. బరువు కూడా తగ్గుతారు, మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Coconut Laddu Recipe : బెల్లం పాకంతో కొబ్బరి లడ్డూలు.. ఆంధ్రా స్టైల్‌లో ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది
బెల్లం పాకంతో కొబ్బరి లడ్డూలు.. ఆంధ్రా స్టైల్‌లో ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది
Pilot Career : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
Excessive Body Heat : బాడీలో హీట్‌ ఎక్కువైతే తినాల్సిన, తినకూడని ఫుడ్స్ లిస్ట్ ఇదే.. వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలంటే?
బాడీలో హీట్‌ ఎక్కువైతే తినాల్సిన, తినకూడని ఫుడ్స్ లిస్ట్ ఇదే.. వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలంటే?
Beerakaya Thokka Pachadi : బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి రెసిపీ.. వేడి వేడి అన్నంలో కలిపి తింటే అదిరిపోతుంది
బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి రెసిపీ.. వేడి వేడి అన్నంలో కలిపి తింటే అదిరిపోతుంది

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Hyderabad Tank Bund Accident: ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
Harish Rao Siddipet : సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
కియా కార్ల దసరా సేల్‌.. రూ.1.70 లక్షల వరకు ప్రయోజనాలు.. అక్టోబర్ ఆఫర్ల పూర్తి లిస్ట్
కియా కార్లపై దసరా ఆఫర్లు.. ఈ పండుగ టైమ్‌లో రూ.1.70 లక్షల వరకు ఆదా!
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
AP NTR Bharosa New Pensions: ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
Embed widget