అన్వేషించండి

వర్షాకాలంలో ఈ సూప్​ డిన్నర్​గా తీసుకుంటే చాలామంచిది.. బరువు కూడా తగ్గుతారు, మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా

Monsoon season healthy eating tips : వర్షాకాలంలో ఇమ్యూనిటీని పెంచుతూ పిల్లల నుంచి పెద్దలవరకు తీసుకోగలిగే ఓ సూప్​ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీనిని కనీసం వారంలో ఓ రోజైనా తాగాలంటున్నారు నిపుణులు. 

Weight Loss Soups for Rainy Season : వర్షాకాలంలో ఇమ్యూనిటీ తగ్గిపోతూ ఉంటుంది. వాతావరణం కూడా చల్లగా ఉంటుంది. ఆ సమయంలో వేడి వేడిగా సూప్ తాగితే చాలా మంచిది. అలాంటి వాటిలో పసుపు, అల్లంతో చేసే సూప్ బెస్ట్ ఆప్షన్. ఉదయం లేదా రాత్రి దీనిని తీసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది మంచి ఆప్షన్. అంతేకాకుండా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందించడంతో పాటు.. శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తుంది. మరి ఈ సూప్​ను ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి వంటి విషయాలు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు 

పసుపు - 1 టేబుల్ స్పూన్

అల్లం - అంగుళం

వెల్లుల్లి - 2 రెబ్బలు

ఉల్లిపాయ - 1చిన్నది 

వెజిటేబుల్ బ్రాత్ - 4 కప్పులు

కొబ్బరి పాలు - 1 కప్పు

ఉప్పు - రుచికి తగినంత 

మిరియాల పొడి - 1 టీస్పూన్

కొత్తిమీర - గార్నిష్ కోసం

తయారీ విధానం 

ముందుగా ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లాన్ని చిన్న చిన్న ముక్కులగా తురుముకోవాలి. కొబ్బరి పాలు ఫ్రెష్​గా తీసుకుంటే మంచిది. వెజిటేబుల్ బ్రాత్ సూపర్ మార్కెట్​లో దొరుకుతుంది. లేదంటే దీనిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా తేలిక. దీనిని తయారు చేసుకోవడం కోసం రెండు క్యారెట్లు, రెండు సెలరీ, రెండు వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ, టమాటా, క్యాబేజి (మీకు నచ్చిన కూరగాయాలను) రెండు కప్పులు తీసుకోవాలి. ఆరు కప్పుల నీరు సిద్ధం చేసుకోవాలి. 

ముందుగా ఓ పెద్ద గిన్నె తీసుకుని దానిలో మీడియం సైజ్​లో కట్​ చేసుకున్న వెజిటేబుల్స్, నీరు వేసుకోవాలి. వీటిని ఓ అరగంట పాటు ఉడికించాలి. ఇప్పుడు స్టౌవ్ ఆపేయాలి. ఈ వెజిటేబుల్స్​ లేకుండా తయారైన బ్రాత్​ని వేరు చేయాలి. దానిలో మీకు నచ్చితే బిర్యానీ ఆకు, మిరియాల పొడి వేసి మరో పదిహేను నిమిషాలు వేడిచేయాలి. అనంతరం దానిని కూడా వడకడి వెజిటేబుల్ బ్రాత్ రెడీ. దీనిని కూడా నేరుగా తీసుకోవచ్చు. హెల్త్​కి మంచిది. ఫ్రిడ్జ్​లో స్టోర్​ చేసుకుని నచ్చినప్పుడు దీనిని ఉపయోగించవచ్చు. ఫ్రిడ్జ్​లో పెట్టేముందు బ్రాత్ గది ఉష్ణోగ్రతలో ఉండాలి. ఇలా స్టోర్ చేసుకున్న దానిని 5 రోజులు ఉపయోగించవచ్చు. 

ఇప్పుడు మాన్​సూన్ రెసిపీకి వస్తే.. ఓ గిన్నె తీసుకోండి. దానిలో కాస్త నూనె వేసి స్టౌవ్ వెలిగించి దానిపై ఉంచండి. మీడియం మంట ఉంచి దానిలో ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లిని వేసి వేయించండి. అవి కాస్త మృదువుగా ఉడికిన తర్వాత దానిలో పసుపు వేసి ఓ నిమిషం కలపాలి. ఇప్పుడు దానిలో నాలుగు కప్పుల వెజిటేబుల్ బ్రాత్ వేయాలి. బాగా కలిపి.. మంటను తగ్గించి పావు గంట ఉడికించాలి. అనంతరం స్టౌవ్ ఆపేసి.. బ్లెండర్ ఉపయోగించి.. దానిని స్మూత్​గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న సూప్​లో కొబ్బరి పాలు వేస్తే క్రీమీగా ఉంటుంది. తాగేందుకు మంచి రుచిని కూడా అందిస్తుంది.

దీనిలో కాస్త ఉప్పు, మిరియాల పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన సూప్​పై కొత్తిమీరను వేసి.. వేడిగా సర్వ్ చేసుకోవాలి. దీనిని వర్షాకాలంలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. పసుపులోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఇమ్యూనిటీని అందిస్తాయి. మెరుగైన జీర్ణక్రియను అందించడంతో పాటు.. కడుపులోని సమస్యలను దూరం చేస్తాయి. యాంటీ మైక్రోబయాల్, యాంటీ వైరల్ లక్షణాలు సీజనల్ వ్యాధులను దూరం చేస్తాయి. మెటబాలీజం పెంచి బరువును తగ్గిస్తాయి. 

Also Read : టేస్టీ టేస్టీ దొండకాయ ఉల్లికారం.. రోటీ, రైస్​కి పర్​ఫెక్ట్ కాంబినేషన్ రెసిపీ ఇది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jani Master: జానీ మాస్టర్‌ కేసులో బయటపడ్డ సంచలన విషయాలు - ఆయన భార్య కూడా వేధించిందంటూ బాధితురాలు ఆరోపణలు
జానీ మాస్టర్‌ కేసులో బయటపడ్డ సంచలన విషయాలు - ఆయన భార్య కూడా వేధించిందంటూ బాధితురాలు ఆరోపణలు
Andhra Pradesh: బీసీలపై టీడీపీ స్పెషల్ ఫోకస్-చట్ట సభల్లో రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం
బీసీలపై టీడీపీ స్పెషల్ ఫోకస్-చట్ట సభల్లో రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం
Ganesh Festival 2024: ఉత్సాహంగా ముగిసిన గణేష్‌ వేడుకలు- ఈసారి లడ్డూలకు భారీ డిమాండ్
ఉత్సాహంగా ముగిసిన గణేష్‌ వేడుకలు- ఈసారి లడ్డూలకు భారీ డిమాండ్
JK Election: జమ్ముకశ్మీర్‌లో కట్టుదిట్టమైన భద్రత మధ్య తొలి దశ పోలింగ్- అందరూ వచ్చి ఓటు వేయాలని ప్రధాని పిలుపు
జమ్ముకశ్మీర్‌లో కట్టుదిట్టమైన భద్రత మధ్య తొలి దశ పోలింగ్- అందరూ వచ్చి ఓటు వేయాలని ప్రధాని పిలుపు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pawan Kalyan World Record | ఏపీ పంచాయతీరాజ్ శాఖ ప్రపంచ రికార్డు | ABP DesamOperation Polo గురించి 76 ఏళ్ల క్రితం newspapers ఏం రాశాయి | Telangana Liberation Day | ABP Desamనిజాం రాజ్యం ఇండియాలో విలీనమయ్యాక ఖాసిం రజ్వీ ఏమయ్యాడు?Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jani Master: జానీ మాస్టర్‌ కేసులో బయటపడ్డ సంచలన విషయాలు - ఆయన భార్య కూడా వేధించిందంటూ బాధితురాలు ఆరోపణలు
జానీ మాస్టర్‌ కేసులో బయటపడ్డ సంచలన విషయాలు - ఆయన భార్య కూడా వేధించిందంటూ బాధితురాలు ఆరోపణలు
Andhra Pradesh: బీసీలపై టీడీపీ స్పెషల్ ఫోకస్-చట్ట సభల్లో రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం
బీసీలపై టీడీపీ స్పెషల్ ఫోకస్-చట్ట సభల్లో రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం
Ganesh Festival 2024: ఉత్సాహంగా ముగిసిన గణేష్‌ వేడుకలు- ఈసారి లడ్డూలకు భారీ డిమాండ్
ఉత్సాహంగా ముగిసిన గణేష్‌ వేడుకలు- ఈసారి లడ్డూలకు భారీ డిమాండ్
JK Election: జమ్ముకశ్మీర్‌లో కట్టుదిట్టమైన భద్రత మధ్య తొలి దశ పోలింగ్- అందరూ వచ్చి ఓటు వేయాలని ప్రధాని పిలుపు
జమ్ముకశ్మీర్‌లో కట్టుదిట్టమైన భద్రత మధ్య తొలి దశ పోలింగ్- అందరూ వచ్చి ఓటు వేయాలని ప్రధాని పిలుపు
TTD Clarity On Anam Video: ఆనంను టార్గెట్ చేసిన వైసీపీ-సాక్ష్యాధారాలతో బదులిచ్చిన టీటీడీ
ఆనంను టార్గెట్ చేసిన వైసీపీ-సాక్ష్యాధారాలతో బదులిచ్చిన టీటీడీ
Vijayawada News: విజయవాడ వరద ప్రాంత ప్రజలకు మరో హెచ్చరిక- కనీస జాగ్రత్తలు తీసుకోకుంటే పెను ప్రమాదం
విజయవాడ వరద ప్రాంత ప్రజలకు మరో హెచ్చరిక- కనీస జాగ్రత్తలు తీసుకోకుంటే పెను ప్రమాదం
Modi America Tour: భారత ప్రధాని మోదీని కలిసేందుకు ట్రంప్ ఉత్సాహం.. ఎందుకంటే..?
భారత ప్రధాని మోదీని కలిసేందుకు ట్రంప్ ఉత్సాహం.. ఎందుకంటే..?
Jamili Elections : జమిలీ ఎన్నికలు ఎలా సాధ్యం ?  బీజేపీ పెద్దల వ్యూహం ఏమిటి ?
జమిలీ ఎన్నికలు ఎలా సాధ్యం ? బీజేపీ పెద్దల వ్యూహం ఏమిటి ?
Embed widget