రూ.10 లక్షల్లోనే మంచి SUVలు: Hyundai Exter నుంచి Tata Nexon వరకు – ఇప్పుడే కొనదగిన టాప్-10 కార్లు
రూ.10 లక్షల లోపులో అందుబాటులో ఉన్న టాప్-10 చవక SUVల జాబితా ఇది. Hyundai Exter నుంచి Tata Nexon వరకు, ప్రతి SUVలో ఉన్న ముఖ్య ఫీచర్లు, ఇంజిన్, ధర వివరాలు ఇలా ఉన్నాయి.

Affordable SUVs Under 10 Lakhs India 2025: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో బడ్జెట్ SUVల జోరు రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా, రూ. 10 లక్షల లోపు వచ్చే కాంపాక్ట్ SUVలు ఎక్కువ మందికి అందుబాటులో ఉండటంతో ఈ సెగ్మెంట్ నిత్యం హాట్‌గానే ఉంటోంది. GST 2.0 అమల్లోకి వచ్చాక కొన్ని SUVల ధరలు తగ్గడం వల్ల కూడా కొనుగోలుదారులకు చేరువయ్యాయి.
ప్రస్తుతం, రూ.10 లక్షల లోపు లభించే టాప్-10 SUVలు
10. Skoda Kylaq – ప్రారంభ ధర రూ.7.55 లక్షలు
చవక SUVల లిస్ట్‌లో స్కోడా కెలాక్ 10వ స్థానంలో నిలిచింది. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో 115hp శక్తి, మాన్యువల్ & ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు, 7-ఇంచ్ టచ్‌స్క్రీన్, సిక్స్ ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
9. Tata Nexon – ప్రారంభ ధర రూ.7.32 లక్షలు
దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే SUVలలో ఒకటైన నెక్సాన్, మీ బడ్జెట్‌లో మొత్తం 17 వేరియంట్‌లను అందిస్తోంది. పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లు అందుబాటులో ఉండడం ఈ SUVకు పెద్ద ప్లస్. 120hp టర్బో పెట్రోల్ ఇంజిన్ పనితీరు మరో ముఖ్య ఆకర్షణ.
8. Kia Sonet – ప్రారంభ ధర రూ.7.30 లక్షలు
కియా సోనెట్ కూడా 10 వేరియంట్‌లను అందిస్తుంది. 1.2 లీటర్ పెట్రోల్, 1.0 టర్బో పెట్రోల్, 1.5 డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉంటాయి. మాన్యువల్, iMT, DCT, ఆటో గేర్‌బాక్స్‌లు అందుబాటులో ఉండటం సోనెట్‌ను మరింత బలంగా నిలబెడుతోంది.
7. Mahindra XUV 3XO – ప్రారంభ ధర రూ 7.28 లక్షలు
మొత్తం 11 వేరియంట్‌లు రూ.10 లక్షల లోపే లభిస్తున్నాయి. 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు, మాన్యువల్ & ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు కూడా ఉన్నాయి. పెర్ఫార్మెన్స్‌తో పాటు స్టైలింగ్ కూడా బలంగా ఉంది.
6. Toyota Taisor – ప్రారంభ ధర రూ 7.21 లక్షలు
1.2 లీటర్ పెట్రోల్, 1.2 CNG, 1.0 టర్బో పెట్రోల్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. టయోటా నమ్మకానికి తోడు మంచి మైలేజ్ అందించడం ఈ SUV ప్రత్యేకత.
5. Maruti Fronx – ప్రారంభ ధర రూ 6.85 లక్షలు
టైజర్‌కు సిస్టర్ మోడల్‌గా వచ్చిన ఫ్రాంక్స్ మరింత చవక ధరలో అందుబాటులో ఉంది. పెట్రోల్, CNG, టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు దీనిని ప్రజాదరణ పొందేలా చేస్తున్నాయి.
4. Tata Punch – ప్రారంభ ధర రూ 5.99 లక్షలు
టాటా పంచ్ మొత్తం 14 వేరియంట్‌లు రూ.10 లక్షల బడ్జెట్‌లో లభిస్తున్నాయి. 1.2 పెట్రోల్, 1.2 CNG ఆప్షన్లు, మంచి గ్రౌండ్ క్లియరెన్స్, సేఫ్టీ ఫీచర్లు పంచ్‌ను బెస్ట్ సెల్లర్ చేసింది.
3. Renault Kiger – ప్రారంభ ధర రూ 5.76 లక్షలు
ఫేస్‌లిఫ్ట్ వచ్చినా కూడా ధర చవకగానే ఉండటం కిగర్ హైలైట్. 1.0 పెట్రోల్, 1.0 టర్బో పెట్రోల్, AMT, CVT గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.
2. Nissan Magnite – ప్రారంభ ధర రూ 5.61 లక్షలు
నిస్సాన్ మాగ్నైట్ మొత్తం 20 వేరియంట్‌లు రూ.10 లక్షల లోపు లభించడం ఈ SUVను మరింత బడ్జెట్ ఫ్రెండ్లీగా చేస్తోంది. CNG కిట్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
1. Hyundai Exter – ప్రారంభ ధర రూ 5.49 లక్షలు
ప్రస్తుతం భారతదేశంలో అత్యంత చవకైన SUV ఇదే. 40 వేరియంట్‌లతో, పెట్రోల్, AMT, CNG ఆప్షన్లతో విస్తృత ఎంపికను అందిస్తోంది. ఫీచర్లు, మైలేజ్, ధర... ఇలా అన్నీ కలిసి ఆల్-రౌండ్ ప్యాకేజ్‌గా ఎక్స్‌టర్‌ను నిలబడింది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















