అన్వేషించండి

Honda Cancels EV Plans: హోండా EV కలలు ఆగిపోయాయా? ప్లాన్‌లను ఎందుకు రద్దు చేసింది?

Honda Cancels EV Plans: అమెరికా - భారత్‌లో విడుదల కావాల్సిన ఎలక్ట్రిక్ కార్లను హోండా కార్స్ రద్దు చేసింది. కంపెనీ తన ఎలక్ట్రిక్ వాహనాల ప్రణాళికలను అకస్మాత్తుగా ఎందుకు నిలిపివేసిందో చూద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హోండా కొన్ని ఎలక్ట్రిక్ కార్ల ప్రాజెక్టులను రద్దు చేసింది.
  • మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలు, తీవ్రమైన పోటీ కారణాలు.
  • భారత్‌ కోసం '0 ఆల్ఫా' మోడల్ మాత్రం కొనసాగే అవకాశం.
  • హోండా ఇప్పుడు హైబ్రిడ్ కార్లపై దృష్టి సారిస్తోంది.

Honda Cancels EV Plans: ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) హవా కొనసాగుతున్న వేళ, జపాన్‌కు చెందిన దిగ్గజ సంస్థ హోండా మోటార్స్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. త్వరలో తీసుకురాబోతున్నట్టు ప్రకటించిన ఎలక్ట్రిక్ కార్ల ప్రాజెక్టులలో కొన్నింటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం పారిశ్రామిక వర్గాలను ఆశ్చర్యపరిచింది. అమెరికా, భారత్‌ వంటి కీలక మార్కెట్ల కోసం సిద్ధం చేసిన మోడళ్లపై ఈ ప్రభావం పడనుంది. స్టేబుల్‌ డెవలప్‌మెంట్‌, మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలు,  తీవ్రమైన పోటీతో హోండా తన వ్యాపార వ్యూహాన్ని పునర్నిర్మించుకుంటోంది.

హోండా నిర్ణయ వెనుక ఉన్న అసలు కారణాలు

హోండా తన ప్రతిష్టాత్మక '0 సిరీస్ SUV' ఒక ఎలక్ట్రిక్ సెడాన్‌తో సహా మొత్తం మూడు ప్రధాన ఎలక్ట్రిక్ వాహన మోడల్స్‌ను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ ఆకస్మిక నిర్ణయానికి వెనుక బలమైన ఆర్థిక, వ్యూహాత్మక కారణాలు ఉన్నాయని కంపెనీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.  

ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధికి భారీగా నిధులు, సాంకేతిక వనరులు అవసరమవుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని ప్రాజెక్టులపై ఒకేసారి పెట్టుబడి పెట్టడం వల్ల కంపెనీ పోటీతత్వం దెబ్బతినే ప్రమాదం ఉందని హోండా భావిస్తోంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న ఆసియా మార్కెట్లలో తన పట్టు నిలుపుకోవడానికి వనరులను సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే ఒక్క అడుగు వెనక్కి వేసింది. 

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల పట్ల మొదట్లో ఉన్న ఉత్సాహం ప్రస్తుతం కొంత తగ్గుముఖం పట్టిందని విశ్లేషణలు చెబుతున్నాయి. వినియోగదారులు ఆశించిన స్థాయిలో EVల వైపు మొగ్గు చూపకపోవడం, మౌలిక సదుపాయాల కొరత, కొన్ని దేశాల్లో ప్రభుత్వ రాయితీలు లేదా విధానాల్లో మార్పులు రావడం హోండాను పునరాలోచనలో పడేశాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో భారీ పెట్టుబడులు పెట్టడం రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమని కంపెనీ అంచనాకు వచ్చింది. దీని వల్ల ఇప్పటికే ఉన్న మార్కెట్‌పై ప్రభావం పడుతుందని భావిస్తోంది. 

హోండా వంటి పెద్ద కంపెనీలకు ప్రస్తుతం చైనా నుంచి వస్తున్న స్టార్టప్‌లు గట్టి పోటీ ఇస్తున్నాయి. చైనా మార్కెట్లో వినియోగదారుల అభిరుచులు వేగంగా మారుతున్నాయి. ఇప్పుడు కారు కొనుగోలు చేసేటప్పుడు కేవలం ఇంజన్ సామర్థ్యాన్ని మాత్రమే కాకుండా, అందులో ఉండే సాఫ్ట్‌వేర్ ఫీచర్లను కూడా జాగ్రత్తగా గమనిస్తున్నారు. చైనీస్ కంపెనీలు స్మార్ట్ సిస్టమ్స్, కనెక్టెడ్ టెక్నాలజీ, అత్యాధునిక సాఫ్ట్‌వేర్ ఫీచర్లతో కూడిన వాహనాలను తక్కువ ధరకే అందిస్తున్నాయి.

కారును ఒక రవాణా సాధనంగా మాత్రమే కాకుండా, ఒక గ్యాడ్జెట్‌గా చూస్తున్న నేటి తరం వినియోగదారులను ఆకట్టుకోవడంలో చైనా కంపెనీలు ముందంజలో ఉన్నాయి. ఈ సాంకేతిక విప్లవాన్ని తట్టుకుని నిలబడటం హోండాకు పెద్ద సవాలుగా మారింది.   

హోంండా నిర్ణయం భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

భారత మార్కెట్ కోసం హోండా రూపొందించిన ప్రణాళికల్లో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. అయితే, ఒక ఊరటనిచ్చే అంశం ఏమిటంటే, భారత్‌ కోసం ప్రత్యేకంగా రూపొందించిన '0 ఆల్ఫా' ఎలక్ట్రిక్ మోడల్ రద్దు చేసిన జాబితాలో లేదు. దీనిని బట్టి ఈ మోడల్ భవిష్యత్తులో భారత రోడ్లపైకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది, కానీ దీనిపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకనట వేయలేదు.

ప్రస్తుతానికి హోండా తన దృష్టిని హైబ్రిడ్ కార్ల (Hybrid Cars) వైపు మళ్లిస్తున్నట్లు కనిపిస్తోంది. పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ వాహనాలకు వెళ్లడానికి ముందు, హైబ్రిడ్ సాంకేతికత భారతీయ వినియోగదారులకు మరింత చేరువవుతుందని కంపెనీ విశ్వసిస్తోంది. భారతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త మోడళ్లను, అత్యాధునిక టెక్నాలజీని త్వరలోనే తీసుకువస్తామని హోండా హామీ ఇచ్చింది

హోండా భవిష్యత్ వ్యూహం

హోండా తీసుకున్న ఈ వ్యూహాత్మక వెనకడుగు వెనుక దీర్ఘకాలిక లాభాపేక్ష కనిపిస్తోంది. కేవలం ఎలక్ట్రిక్ కార్ల రేసులో ఉండటం కోసం అనవసరమైన పెట్టుబడులు పెట్టడం కంటే, డిమాండ్ ఉన్న విభాగాలపై దృష్టి పెట్టడం ఉత్తమమని కంపెనీ భావిస్తోంది. చైనా కంపెనీల పోటీని తట్టుకుంటూ, హైబ్రిడ్ టెక్నాలజీతో తన మార్కెట్ వాటాను కాపాడుకోవడమే లక్ష్యంగా హోండా అడుగులు వేస్తోంది. భారత్‌ వంటి దేశాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడే వరకు హైబ్రిడ్ వాహనాలే కీలకమని కంపెనీ నమ్ముతోంది.

Frequently Asked Questions

హోండా ఎలక్ట్రిక్ కార్ల ప్రాజెక్టులను ఎందుకు రద్దు చేసింది?

మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలు, తీవ్రమైన పోటీ, మరియు పెట్టుబడులను సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి హోండా కొన్ని EV ప్రాజెక్టులను రద్దు చేసింది.

రద్దు చేయబడిన ఎలక్ట్రిక్ వాహన మోడల్స్ ఏమిటి?

హోండా తన '0 సిరీస్ SUV' తో సహా మొత్తం మూడు ప్రధాన ఎలక్ట్రిక్ వాహన మోడల్స్‌ను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది.

భారతదేశంలో హోండా EV ప్రణాళికలపై ఈ నిర్ణయం ఎలా ప్రభావం చూపుతుంది?

భారతదేశం కోసం రూపొందించిన '0 ఆల్ఫా' ఎలక్ట్రిక్ మోడల్ రద్దు కాలేదు, కాబట్టి అది భారత మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం, హోండా హైబ్రిడ్ కార్లపై దృష్టి సారిస్తోంది.

చైనా కంపెనీల నుండి హోండా ఎలాంటి పోటీని ఎదుర్కొంటోంది?

చైనా స్టార్టప్‌లు తక్కువ ధరకే స్మార్ట్, కనెక్టెడ్ టెక్నాలజీతో కూడిన వాహనాలను అందిస్తున్నాయి. ఈ సాంకేతిక విప్లవాన్ని తట్టుకోవడం హోండాకు సవాలుగా మారింది.

టాప్ హెడ్ లైన్స్

ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
PM Modi Chennai Tour: సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!
సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
Embed widget