అన్వేషించండి

IAF Wing Commander commits suicide: చత్తీస్‌ఘడ్‌లో వింగ్ కమాండ్ ఆత్మహత్య - భార్యతో గొడవలే కారణమా?

Wing Commander : భారత వైమానిక దళంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వింగ్ కమాండర్ ఆత్మహత్య చేసుకున్నారు . బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న భార్య కారణంగానే చనిపోయినట్లుగా అనుమానిస్తున్నారు

IAF Wing Commander commits suicide in Chhattisgarh:  భారత వైమానిక దళంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఒక ఉన్నతాధికారి ఆత్మహత్య  హాట్ టాపిక్ గా మారింది.  ఛత్తీస్‌ఘడ్‌ రాయ్‌పూర్‌లో యాంటీ నక్సల్ ఆపరేషన్స్ విభాగంలో పనిచేస్తున్న  వింగ్ కమాండర్ విపుల్ యాదవ్ బుధవారం ఉదయం తన అధికారిక నివాసంలో విగతజీవిగా కనిపించారు. విధి నిర్వహణలో ఎంతో ధైర్యవంతుడిగా పేరున్న అధికారి, ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం తోటి అధికారులను, సిబ్బందిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

రాయ్‌పూర్‌లోని తేలీబంధా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎమ్మెల్యే కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. బుధవారం ఉదయం విపుల్ యాదవ్ గది తలుపులు తీయకపోవడంతో, ఇంట్లో పనిచేసే వ్యక్తి కిటికీలోంచి చూడగా ఆయన ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ సమయంలో ఆయన భార్య బెంగళూరులో ఉండగా, ఇద్దరు పిల్లలు పక్క గదిలోనే నిద్రిస్తున్నట్లు సమాచారం. ఘటనా స్థలంలో ఎటువంటి ఆత్మహత్య లేఖ లభించలేదు.  

పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ ఆత్మహత్యకు కుటుంబ కలహాలే  కారణమని అనుమానిస్తున్నారు. విపుల్ యాదవ్ భార్య గతంలో వైమానిక దళంలోనే పనిచేశారు, ప్రస్తుతం ఆమె బెంగళూరులోని ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో టెక్కీగా పనిచేస్తున్నారు. 2014లో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ, గత కొంతకాలంగా వీరి మధ్య తీవ్రమైన మనస్పర్థలు ఉన్నాయని, తరచూ గొడవలు జరుగుతుండేవని రాయ్‌పూర్ పోలీసులు తెలిపారు. ఈ వ్యక్తిగత సమస్యల వల్ల కలిగిన మానసిక ఒత్తిడే ఆయనను ఈ విపరీత నిర్ణయానికి ప్రేరేపించి ఉండవచ్చని ఏసీపీ రమాకాంత్ సాహు పేర్కొన్నారు.                             

నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల వంటి అత్యంత ఒత్తిడితో కూడిన విధుల్లో ఉంటూ, మరోవైపు కుటుంబ పరమైన ఇబ్బందులను ఎదుర్కోవడం ఆయనను కుంగదీసి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఆయన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. సైనిక దళాల్లో అధికారుల మానసిక ఆరోగ్యం మరియు వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి సరైన వ్యవస్థలు అవసరమని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.   

టాప్ హెడ్ లైన్స్

Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Dharmendra Pradhan: విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Embed widget