Jio Cloud Storage Offer: సుందర్ పిచాయ్‌తో ముకేష్ అంబానీ 'ఢీ' - గూగుల్‌పైకి జియో 'మేఘాస్త్రం'
Jio Cloud Storage: ఇప్పటివరకు, క్లౌడ్ స్టోరేజ్ మార్కెట్‌లో గూగుల్ ఆధిపత్యం చెలాయించింది. ఇప్పుడు, రిలయన్స్ జియో కూడా ఈ సేవను తన వినియోగదారులకు అందిస్తోంది.

Reliance Jio Offers Up To 50GB Of Free Cloud Storage: ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ జియో, సుందర్ పిచాయ్ ఆధ్వర్యంలోని గూగుల్ (Google)తో క్లౌడ్ వార్ ప్రారంభించింది. గూగుల్‌కు పోటీగా, రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం గొప్ప ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద, జియో యూజర్లకు 50 GB వరకు క్లౌడ్ స్టోరేజ్‌ను ఉచితంగా అందిస్తోంది. జియో కొత్త సర్వీస్ గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ (Google Cloud Storage)కు గట్టి సవాల్ లాంటిది. ప్రస్తుతం, గూగుల్ తన జీమెయిల్ (Gmail), గూగుల్ డ్రైవ్ (Google Drive) ద్వారా 5 GB నుంచి 15 GB వరకు మాత్రమే ఉచిత క్లౌడ్ స్పేస్ అందిస్తోంది.
వీరికి మాత్రమే జియో క్లౌడ్ స్టోరేజ్ ఆఫర్
రిపోర్ట్‌ల ప్రకారం, రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌తో జియో సిమ్‌ను రీఛార్జ్ (Jio prepaid recharge plan of Rs 299 or above) చేసుకునే ప్రీపెయిడ్ యూజర్లకు మాత్రమే జియో క్లౌడ్ స్టోరేజ్ అందుబాటులో ఉంటుంది. పోస్ట్‌పెయిడ్ యూజర్ల విషయానికి వస్తే, కోసం ఈ ఆఫర్ అన్ని ప్లాన్‌ల రీఛార్జ్‌పై (All postpaid recharge plans of Jio) అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకునే వినియోగదారులు ఎటువంటి డబ్బు చెల్లించకుండానే ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, ఇతర డిజిటల్ కంటెంట్‌ను ఆన్‌లైన్‌లో పూర్తి ఉచితంగా నిల్వ చేసుకోవచ్చు.
గత ఏడాది లాంఛింగ్
2024లో జరిగిన రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)లో ఈ ఆఫర్‌ను ప్రకటించారు. అయితే, ఆ సమయంలో, 100 GB వరకు ఉచిత AI పవర్డ్ స్టోరేజ్ సౌకర్యం ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు, ఈ ఆఫర్ అర్హత కలిగిన ప్రీపెయిడ్ కస్టమర్లు & పోస్ట్‌పెయిడ్ కస్టమర్లందరికీ అందుబాటులో ఉంది. అంటే.. రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకునే వినియోగదారులంతా 50 GB వరకు ఉచిత క్లౌడ్ స్టోరేజ్ ఉపయోగించుకోవడానికి అర్హత పొందుతారు. అదే సమయంలో, అందరు పోస్ట్‌పెయిడ్ యూజర్ల కూడా 50 GB వరకు క్లౌడ్ స్టోరేజ్‌ను పూర్తి ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.
క్లౌడ్ స్టోరేజ్‌తో ఏంటి ప్రయోజనం?
ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, ఇతర డిజిటల్ కంటెంట్‌ను జియో క్లౌడ్ స్టోరేజ్‌లో భద్రపరుచుకోవడం వల్ల వాటిని ప్రపంచంలో ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయవచ్చు. మీరు మీ మొబైల్ ఫోన్ లేదా డివైజ్‌ను మార్చినప్పటికీ, మీ అకౌంట్‌లోకి లాగిన్ కాగానే కొత్త డివైజ్‌లో అవన్నీ కనిపిస్తాయి. మీ ఫోన్ లేదా డివైజ్ దొంగతనానికి గురైనా లేదా పాడైపోయినా క్లౌడ్ స్టోరేజ్‌లో ఉన్న కంటెంట్ పూర్తి భద్రంగా ఉంటుంది, అవసరమైనప్పుడు మీ కళ్ల ముందుకు వస్తుంది.
జియో క్లౌడ్ స్టోరేజ్‌ను ఎలా ఉపయోగించుకోవాలి?
* ముందుగా, గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) లేదా ఆపిల్ యాప్ స్టోర్ (Apple App Store) నుంచి జియో క్లౌడ్ (Jio Cloud) యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
* ఆ తర్వాత మీ జియో నంబర్‌తో సైన్ ఇన్ చేయాలి లేదా కొత్త అకౌంట్ క్రియేట్ చేయాలి.
* ఇప్పుడు మీ డివైజ్ నుంచి క్లౌడ్ స్టోరేజ్‌లోకి ఏదైనా ఫైల్‌ను అప్‌లోడ్ చేయడానికి అప్‌లోడ్ బటన్‌పై క్లిక్ చేయండి.
* కావాలంటే, మీరు ఆ ఫైల్‌ను ఒక ఫోల్డర్‌లో సేవ్ చేయవచ్చు, మేనేజ్ చేయవచ్చు లేదా పేరు కూడా మార్చవచ్చు.
* జియో క్లౌడ్ స్టోరేజ్‌లోని ఫైల్‌ను ఇంకెవరికైనా షేర్ చేసే వెసులుబాటు కూడా ఉంది. దీనికోసం షేర్ బటన్ నొక్కి & ఫైల్ పంపే వ్యక్తిని ఎంచుకోవాలి.
* మీ మొబైల్ ఫోన్‌తో పాటు ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌లో కూడా జియో క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌ను యాక్సెస్ చేయవచ్చు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

