Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్, ఐదుగురు మావోయిస్టులు మృతి

Encounter in Chhattisgarhs Dantewada | ఛత్తీస్ గఢ్‌లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతాలలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ కోసం భద్రతా దళాల బృందం వెళ్లింది. యాంటీ మావోయిస్టు ఆపరేషన్ సమయంలో భాగంగా మంగళవారం ఉదయం భద్రతా బలగాలకు మాయివోస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో నేటి ఉదయం 8 గంటల నుండి మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. కనీసం ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారని పోలీసులు ప్రాథమికంగా చెబుతున్నారు. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి ఐదుగురు నక్సలైట్ల మృతదేహాలతో పాటు భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల జరిగిన రెండు భారీ ఎన్‌కౌంటర్లలో మొత్తం 30 మంది మావోయిస్టులు మృతిచెందగా, ఓ జవాన్ అమరుడయ్యారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

