అన్వేషించండి

Microfinance loan Eligibility: హామీ లేకుండా లోన్స్.. మైక్రోఫైనాన్స్ లోన్ ఎవరికి ఇస్తారు, RBI రూల్స్ తెలుసా ?

Microfinance Loan: సాధారణ లోన్స్ లాగే బ్యాంకులు, చిన్న ఆర్థిక బ్యాంకులు, NBFCల నుండి మైక్రోఫైనాన్స్ లోన్స్ తీసుకోవచ్చు. NGOలు, ప్రాంతీయ బ్యాంకులు, కమర్షియల్ బ్యాంకులు ఈ సేవలను అందిస్తున్నాయి.

Microfinance Loan Eligibility: దేశంలో పరిమిత ఆదాయం ఉన్నవారు బ్యాంకుల నుండి రుణాలు (Loans) పొందేందుకు అవసరమైన ఆస్తులు లేదా హామీలు లేని వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారికి మైక్రోఫైనాన్స్ లోన్స్ ఒక ముఖ్యమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రకారం, మైక్రోఫైనాన్స్ రుణాలు అనేవి ఎలాంటి గ్యారెంటీ (హామీ) లేకుండా ఇచ్చే లోన్స్.

మైక్రో ఫైనాన్స్ లోన్ అంటే.. వీటిని తీసుకోవడానికి ఎటువంటి ఆస్తిని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. సాధారణంగా వార్షిక ఆదాయం రూ. 3 లక్షల వరకు ఉన్న వ్యక్తులకు ఈ సౌకర్యం కల్పిస్తారు. తక్కువ ఆదాయం ఉన్నవారికి ఆర్థికంగా ఆసరా అందించడం అనేది ఈ లోన్స్ మంజూరు ముఖ్య ఉద్దేశ్యం. దీని ద్వారా వారు తమ అవసరాలను తీర్చుకోవడానికి లేదా చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి ఆర్థిక సహాయం లభిస్తుంది. మైక్రో ఫైనాన్స్ లోన్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

మైక్రోఫైనాన్స్ లోన్ అంటే ఏమిటి?

సాధారణ లోన్స్ తరహాలోనే మైక్రోఫైనాన్స్ రుణాలు కూడా బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, NBFCల నుండి లభిస్తాయి. ఇవే కాకుండా ఎన్జీవోలు (NGOs), ప్రాంతీయ రూరల్ బ్యాంకులు, కమర్షియల్ బ్యాంకులు,పేమెంట్ బ్యాంకులు కూడా ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. వీటి వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉండవు, సాధారణ రుణాల మాదిరిగానే ఉంటాయి. సాధారణంగా ఇందులో రూ. 10,000 నుండి రూ. 1.25 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ మొత్తం అంతకంటే ఎక్కువగా కూడా ఉంటుంది.

ఈ లోన్స్‌లో ఎడ్యుకేషన్ లోన్, కన్స్యూమర్ ప్రొడక్ట్ లోన్, ఎమర్జెన్సీ లోన్, ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇచ్చే లోన్, అగ్రికల్చర్ లోన్, చిన్న వ్యాపారాలు లేదా వ్యక్తిగత అవసరాల కోసం ఇచ్చే లోన్ వంటివి ఉన్నాయి. దీని కాలపరిమితి సాధారణంగా 1 నుండి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. ఒకవేళ ఎవరైనా గడువు కంటే ముందే లోన్ తిరిగి చెల్లిస్తే, వారిపై ఎటువంటి 'ప్రీపేమెంట్ పెనాల్టీ' లాంటివి విధించకపోవడం ఇందులో ఉన్న ప్రత్యేకత.

మైక్రోఫైనాన్స్ లోన్ ఎవరు తీసుకోవచ్చు?

సాధారణంగా చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి, వ్యవసాయ పనుల కోసం లేదా ఆదాయాన్ని పెంచే ఇతర పనుల కోసం మైక్రోఫైనాన్స్ రుణాలు ఇస్తారు. అయితే దీని కోసం కొన్ని ముఖ్యమైన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. భారత పౌరులెవరైనా దీని కోసం అప్లై చేసుకోవచ్చు, కానీ వారి వార్షిక ఆదాయం రూ. 3 లక్షల లోపే ఉండాలి.

వయస్సు విషయానికి వస్తే, 18 నుండి 60 సంవత్సరాల మధ్య ఉన్నవారు ఈ లోన్ పొందడానికి అర్హులు అవుతారు. అలాగే, రుణగ్రహీత చెల్లించే నెలవారీ EMI వారి నెలవారీ ఆదాయంలో 50 శాతం కంటే మించకూండా చూసుకోవాలి. ఈ నిబంధనలన్నింటినీ పూర్తి చేసే వారు ఈ మైక్రోఫైనాన్స్ లోన్ సహాయంతో తమ ఆదాయాన్ని పెంచుకోవచ్చు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Income Tax Notice: చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
LIC Unclaimed Funds: ఎల్‌ఐసీలో రూ.7,318 కోట్ల అన్‌క్లెయిమ్డ్ డబ్బు! మీ సొమ్ము ఉందేమో ఇలా చెక్ చేసుకోండి
ఎల్‌ఐసీలో రూ.7,318 కోట్ల అన్‌క్లెయిమ్డ్ డబ్బు! మీ సొమ్ము ఉందేమో ఇలా చెక్ చేసుకోండి
Post Office RD Scheme: మీ ఫ్యామిలీ కోసం ఇన్వెస్టిమెంట్.. ఈ పోస్టాఫీస్ స్కీమ్‌లో ప్రతినెల చిన్న పొదుపుతో చక్రవడ్డీ
మీ ఫ్యామిలీ కోసం ఇన్వెస్టిమెంట్.. ఈ పోస్టాఫీస్ స్కీమ్‌లో ప్రతినెల చిన్న పొదుపుతో చక్రవడ్డీ
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
IND vs ZIM 3rd T20 Update:  వైభవ్ సూర్యవంశీ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ .. టీమిండియా భారీ స్కోరు, క్లీన్ స్వీప్ దిశగా శ్రేయ‌స్ సేన సూప‌ర్ స్కెచ్!
వైభవ్ సూర్యవంశీ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ .. టీమిండియా భారీ స్కోరు, క్లీన్ స్వీప్ దిశగా శ్రేయ‌స్ సేన సూప‌ర్ స్కెచ్!
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Dharmendra Pradhan Resignation: విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Second Marriage OTT : ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
Embed widget