Jagan: జగన్ పై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం - చట్టాన్ని గౌరవించని వారికి సెల్యూట్ చేయబోమని హెచ్చరిక
Police: పోలీసు అధికారుల బట్టలూడదీస్తానని జగన్ అన్న మాటలపై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన మాటల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది.

Andhra Police Officers Association: ఆంధ్రప్రేదశ్ పోలీసు అధికారుల సంఘం మాజీ సీఎం జగన్ పై మండిపడింది. తాము నాలుగు సింహాలకే సెల్యూట్ చేస్తామని చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించని ఎవరికీ సెల్యూట్ చేయబోమని స్పష్టం చేసింది. జగన తీరు చూస్తూంటే ఆయన చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించడం లేదని స్పష్టమవుతోందని అన్నారు. పోలీసులపై బెదిరింపు వ్యాఖ్యలు మానుకోవాలని పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు అన్నారు. రిటైర్ అయిన తర్వాత కూడా బట్టలిప్పి తీసుకొచ్చి నిలబెడతామనడం సరి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల మనోభావాలు, ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పోలీసులంతా ఎనిమిది నెలల కిందట వైసీపీ ప్రభుత్వంలో విధులు నిర్వహించిన వారేనని గుర్తుంచుకోవాలన్నారు. రాజకీయాలకు, వర్గ ద్వేషాలకు అతీతంగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని జనకుల శ్రీనివాసరావు తెలిపారు. రాజకీయ లబ్ది కోసం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందని వ్యాఖ్యానించడం అత్యంత దురదృష్టకరమన్నారు. పోలీసులు సత్యానికి, చట్టానికి , ధర్మానికి, న్యాయానికి సంకేతాలు అయిన నాలుగు సింహాలకే సెల్యూట్ చేస్తారని స్పష్టం చేశారు.
జగన్ ఏమన్నారంటే ?
జైల్లో వంశీని పరామర్శించిన తర్వాత బయట మీడియాతో మాట్లాడారు. పోలీసులను ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని ఎల్లకాలం టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉండదన్నారు. అన్యాయాలు చేసిన వారిని బట్టలూడదీసి నిలబెడతామన్నారు. ఎక్కడ ఉన్నా తీసుకువస్తామని స్పష్టం చేశారు జగన్. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూలిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీ చోటా వీళ్లే కేసులు పెడుతున్నారు.. వీళ్లే బెదిరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇకనైనా పోలీసులు టిడిపి నాయకుల కోసం పనిచేయడం ఆపాలని... టోపీపై ఉండే మూడు సింహాలకు సెల్యూట్ చేయాలని జగన్ సూచించారు.
ఓ సీఐ దురుసుగా ప్రవర్తించాడట..
వంశీ అరెస్ట్ సమయంలో కూడా ఓ సిఐ చాలా దురుసుగా ప్రవర్తించాడట... మరికొద్దిరోజుల్లో రిటైర్ అవుతున్నాను కాబట్టి మీరేం చేయలేరని అన్నాడట. ఇలాంటి పోలీసులకు చెబుతున్నా... మీరు రిటైరయి సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకువస్తాం... బట్టలు ఊడదీస్తాం అని వైఎస్ జగన్ హెచ్చరించారు. భుత్వం చేస్తున్న అన్యాయంలో భాగస్వాములు కావద్దు.... లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జగన్ హెచ్చరించారు. మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలని పోలీసులకు సూచించారు. ఓవరాక్షన్ చేస్తే ఆ దేవుడు, ప్రజలే శిక్షిస్తారని జగన్ అన్నారు. ఈ మాటలు అవమానించేలా ఉన్నాయని పోలీసు అధికారుల సంఘం మండిపడింది.
గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పోలీసులపై టీడీపీ నేతలు చేసిన విమర్శలపై కూడా జనకుల శ్రీనివాసరావు స్పందించారు. అప్పట్లో ఆయన మీసం మెలెసి, తొడలు కూడా కొట్టేవారు.
Also Read: సత్యవర్థన్‌ను వంశీ ఇంటికి తీసుకెళ్లిన అనుచరులు - సంచలన వీడియో రిలీజ్ చేసిన టీడీపీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

