High Tension in Tuni | ఘర్షణలకు దారి తీసిన తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక | ABP Desam
కాకినాడ జిల్లా తుని మున్సిపల్ కార్యాలయం దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తుని మున్సినపల్ వైఎస్ ఛైర్మన్ ఎన్నిక ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడగా ఈరోజు మూడోసారి ఎన్నిక నిర్వహించేందుకు సమయం ఇచ్చారు ఎన్నికల అధికారి. అయితే వైసీపీ కౌన్సిలర్లకు, టీడీపీ కౌన్సిలర్లకు మధ్య మొదలైన వాగ్వాదం ఘర్షణల వరకూ దారి తీసింది. వైసీపీ కౌన్సిలర్లను మాజీ మంత్రి దాడి శెట్టి రాజా తన మనుషులతో కిడ్నాప్ చేయించారని టీడీపీ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోనివ్వటం లేదని వాళ్ల లో చాలా మందికి టీడీపీ కి మద్దతు గా ఉంటారని టీడీపీ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. కోరం లేకపోవటంతో ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రిసెడింగ్ ఆఫీసర్ రవి కుమార్ ప్రకటించారు.మున్సిపల్ కార్యాలయం బయట ఆందోళనలు తీవ్రస్థాయి కి వెళ్లటంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. స్వల్ప లాఠీ ఛార్జి చేసి ఇరు పార్టీ ల కార్యకర్తలను తరిమికొట్టారు. మరోవైపు దాడిశెట్టి రాజా పిలుపునిచ్చిన ఛలో తుని కోసం వస్తున్న వైసీపీ నేతలు మాజీ మంత్రి కురసాల కన్నబాబును పోలీసులు అడ్డుకున్నారు. తునిలో సెక్షన్ 163 ఉందని ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించేందుకు అనుమతులు లేవని పోలీసలుు తెలిపారు..ఈ కట్టడిపై కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు పోలీసులు నోటీసులు ఇచ్చినా ఆగకుండా తునికి బయల్దేరిని ముద్రగడ పద్మనాభరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు . తుని రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద జాతీయ రహదారిపై ఆపిన పోలీసులు ఆయన్ను అతి కష్టం మీద వెనక్కు పంపించారు.





















