వర్షం వస్తున్నప్పుడు ఏమైనా టేస్టీగా తినాలనుకుంటే బ్రెడ్ రోల్స్ చేసుకోవచ్చు.

పైగా ఇవి పెద్దల నుంచి పిల్లల వరకు అందరికీ నచ్చుతాయి. దీనిని ఎలా చేయాలంటే..

క్యారెట్స్, క్యాప్సికమ్స్ చిన్నగా కోసి అరకప్పు తీసుకోవాలి. ఉడికించిన ఆలు తీసుకోవాలి.

ఇప్పుడు స్టౌవ్ వెలిగించి.. దానిలో అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి వాసన వచ్చే వరకు వేయించాలి.

దానిలో కూరగాయలు వేసి బాగా కలిపి ఉడికించాలి. అనంతరం కొత్తిమీర వేసి కలపాలి.

ఇప్పుడు స్టౌవ్ ఆపేసి.. బ్రెడ్స్ తీసుకోవాలి. బ్రెడ్ స్లైస్ తీసుకుని చపాతీ కర్రతో సన్నగా చేయాలి.

ఈ బ్రెడ్​పై వెజిటెబుల్ మిక్స్ వేసి.. దానిని రోల్ చేయాలి. చివర్లను నీటిని అప్లై చేసి రోల్ చుట్టాలి.

బేకింగ్ ట్రేలో రోల్స్ ఉంచి బేక్ చేయాలి. గ్లోల్డెన్ ఫినిషింగ్ కోసం ఆలివ్ ఆయిల్​ అప్లై చేసి బేక్ చేయాలి.

ప్రీహీట్ చేసిన ఓవెన్​లో 20-25 నిమిషాలు ఉంచి.. అవి గోల్డెన్ బ్రౌన్, క్రిస్పీ అయ్యేవరకు బేక్ చేయాలి.

వీటిని టోమాటో కెచప్​తో కలిపి తీసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. (Images Source : Envato)