పాలకోవా అంటే చాలామందికి ఇష్టముంటుంది. కానీ దానిని చేసుకోవడం కష్టం.

కానీ మీకు తెలుసా? పాలకోవను చాలా సింపుల్​గా ఇంట్లోనే చేసుకోవచ్చు.

తక్కువ పదార్థాలతో ఈ టేస్టీ స్వీట్​ను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.

ఒకటిన్నర లీటర్ ఆవుపాలు, నిమ్మరసం 4 టీస్పూన్, పంచదార అరకప్పు, దాల్చినచెక్కపొడి అర టీస్పూన్.

ముందుగా మందపాటి కడాయిని తీసుకోవాలి. దానిలో ఆవుపాలు వేయాలి.

పాలు సగం మరిగాలి. అప్పుడే అది చిక్కగా మారుతుంది.

ఇప్పుడు దానిలో నాలుగు చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపాలి. అది రవ్వగా మారుతుంది.

ఇప్పుడు దానిలో పంచదార వేసి బాగా కలపాలి. యాలకుల పొడి వేసి మంట మీద నుంచి దించేయాలి.

దానిని బాగా మిక్స్ చేసి.. ఓ ప్లేట్​లో వేసి.. 20 నిమిషాలు వదిలేయాలి.

అంతే పాలకోవ రెడీ. బాదం పలుకులతో గార్నిష్ చేస్తే టేస్టీ పాలకోవ రెడీ. (Images Source : Envato)