ఈ వర్షానికి వేడి వేడి ఉల్లిపకోడి తింటే ఉంటాది. ఈజీగా చేసుకునేందుకు ఈ రెసిపీని ఫాలో అవ్వొచ్చు.

వర్షంపడే సమయంలో ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి.

అప్పుడు వేడి వేడిగా ఉల్లిపకోడి చేసుకుంటే రైన్.. పకోడి.. ఛాయ్ పర్​ఫెక్ట్ కాంబినేషన్ అవుతుంది.

ఉల్లిపాయ పకోడి కోసం మూడు ఉల్లిపాయలు, మూడు పచ్చిమిర్చి, కరివేపాకు రెబ్బలు తీసుకోండి.

అల్లం అంగుళం తురుముకోవాలి. సోడా, ఉప్పు, కొత్తిమీర తురమును సిద్ధం చేసుకోవాలి.

జీలకర్ర, శనగపిండి రెండు కప్పులు సిద్ధం చేసుకుని ఓ మిక్సింగ్ బౌల్ తీసుకోండి.

దానిలో శనగపిండి మిగిలిన అన్ని పదార్థాలు కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి.

స్టౌవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి.

నూనె కాగిన తర్వాత దానిలో పకోడిలు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి.

అంతే టేస్టీ టేస్టీ ఆనియన్ పకోడిలు రెడీ. హాయిగా వర్షంలో లాగించేయండి. (Images Sources : Envato)