చాలా సింపుల్గా, టేస్టీగా ఉండే స్వీట్ చేసుకోవాలనుకుంటే కొబ్బరి హల్వా చేసుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఈ కొబ్బరి హల్వాని విష్ణువుకు నైవేద్యంగా కూడా పెడతారు. దీనిని తయారు చేయడం చాలా తేలిక. తక్కువ పదార్థాలతో ఈ టేస్టీ రెసిపీ చేయొచ్చు. రెండు కప్పుల పచ్చి కొబ్బరి తురుము ఉంటే కప్పు బెల్లం తీసుకోవాలి. యాలకుల పొడి అర టీ స్పూన్, నెయ్యి మూడు టేబుల్ స్పూన్లు రెడీ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ రెడీ చేసుకుంటే వేసుకుంటే రుచి మరింత పెరుగుతుంది. ముందుగా కొబ్బరి తురుము, బెల్లాన్ని మిక్సీ జార్లో తీసుకుని కాస్త నీరు వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. మందపాటి కడాయి తీసుకుని దానిలో కాస్త నెయ్యి వేయాలి. దానిలో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. దానిలోనే కొబ్బరి మిశ్రమాన్ని వేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి. అడుగు పట్టకుండా చూసుకోవాలి. మిశ్రమం దగ్గరకు అవ్వాలి. అలా అని పాకం కాకుండా చూసుకోవాలి. దానిలో యాలకుల పొడి వేసుకోవాలి. చివర్లో మరి కాస్త నెయ్యి వేసుకుంటే హల్వా రెడీ. ఇది నాలుగైదురోజులు నిల్వ ఉంటుంది. (Images Source : Envato)