పొద్దున్న లేవగానే పనులు, హడావుడిగా ఉంటుంది. ఎంత పని ఉన్నా బ్రేక్ ఫాస్ట్ అయితే కంపల్సరీ. ఇక పొద్దున్నే హెవీగా తింటే ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అందుకే ఈ ఈజీ అండ్ హెల్దీ బ్రేక్ ఫాస్ట్ లు మీ కోసం.. ఓవర్ నైట్ ఓట్స్.. జార్ లో పాలు, గ్రీక్ యోగర్ట్, చియా సీడ్స్, తెనె, రోల్డ్ ఓట్స్ కలిపి రాత్రంతా ఫ్రిజ్ లో పెట్టాలి. పొద్దున్న ఫ్రూట్స్ వేసుకుని తినొచ్చు. అరటికాయ, ఫ్రోజన్ బెర్రీస్, గ్రీక్ యోగర్ట్, పాలు అన్ని కలపాలి. గ్రనోలా, పండ్లు, గింజలు లేదా నట్స్ కలిపితే స్మూతీ బౌల్ రెడీ. బ్రెడ్ మీద అవకాడో పేస్ట్ పూసి, ఉప్పు, మిరియాలపొడి కావాల్సిన టాపింగ్స్ వేసుకుంటే అవకాడో టోస్ట్ రెడీ. జార్ లో పాలు, చియా సీడ్స్, తేనె కలిపి రాత్రంతా ఫ్రిజ్ లో ఉంచాలి. పొద్దున్నే ఏవైనా పండ్ల ముక్కలతో తినేస్తే సరి. జార్ లో గ్రీక్ యోగర్ట్, గ్రనోలా, పండ్లు వేసి పై నుంచి తేనె లేదా మ్యాపిల్ సిరప్ వేస్తే టేస్టీ బ్రేక్ ఫాస్ట్ రెడీ. హెల్త్, లైఫ్ స్టైల్ అప్ డేట్స్ కోసం ఏబీపీని ఫాలో అవ్వండి.