సమ్మర్ అంటే వెంటనే గుర్తొచ్చేది మామిడి పండు. మామిడి పండు నచ్చని వాళ్లు ఎవరైనా ఉంటారా చెప్పండి. మామిడితో రకరకాలు వంటలు చేసుకోవచ్చు. అవేంటో చూసేద్దాం. మ్యాంగో స్క్వాష్.. మామిడి పండులో తేనె, కొద్దిగా నిమ్మరసం వేసి చేసుకుంటే మ్యాంగో స్క్వాష్ రెడీ. ఆమ్ పన్నా స్వీట్ గా, వగరుగా డిఫరెంట్ టేస్ట్ లో ఉంటుంది. సమ్మర్ లో మెరుగైన అరుగుదలను ఇస్తుంది. కొబ్బరిపాలు, నిమ్మరసం, మామిడి పండుతో చేసుకునే మ్యాంగో లైమ్ పాప్సికల్ భలే ఉంటుంది. యోగర్ట్, మామిడి పండుతో మ్యాంగో లస్సీ భలే ఉంటుంది. దాంట్లో డ్రైఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఫుల్ ఫ్యాట్ మిల్క్, మామిడిపండు గుజ్జు, కొద్దిగా యోగర్ట్ వేసి మ్యాంగో స్మూతీ చేసుకుంటే వాహ్వా! ఇంట్లోనే మామిడి పండుతో చక్కటి మ్యాంగో పుడ్డింగ్ చేసుకోవచ్చు. మామిడి పండు, మ్యాపిల్ సిరప్, నిమ్మరసం మూడు ఉంటే చాలు మ్యాంగో షర్బత్ రెడీ.