రోజూ 45 నిమిషాలు నడిస్తే కలిగే లాభాలివే

Published by: Geddam Vijaya Madhuri

రోజూ 45 నిమిషాలు నడవటం ద్వారా మీరు నెలలో సుమారు 6000 నుంచి 9000 కేలరీలను తగ్గించుకోవచ్చు.

చురుకైన నడక కేవలం 45 నిమిషాల్లో 320 కేలరీల వరకు బర్న్ చేయవచ్చు.

ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

క్రమం తప్పకుండా నడవటం వల్ల గుండె బలపడుతుంది. గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది.

నడవడం వల్ల శరీర జీవక్రియ రేటు పెరుగుతుంది. ఇది పొట్టలోని అదనపు కొవ్వును కరిగిస్తుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు నడక రక్తంలో చక్కెరను సమతుల్యం చేయడానికి, కండరాలను బలోపేతం చేయడానికి ఉత్తమ మార్గం.

నడక సమయంలో శరీరంలో 'ఎండార్ఫిన్స్' (హ్యాపీ హార్మోన్లు) విడుదలవుతాయి. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి.

మనస్సు ప్రశాంతంగా ఉండటం వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది. రాత్రి బాగా గాఢమైన, మంచి నిద్ర వస్తుంది.

నడిచేప్పుడు సౌకర్యవంతమైన స్పోర్ట్స్ షూస్ ధరించి, శరీరాన్ని హైడ్రేటెడ్ చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇది కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచి ఫలితాలు చూడవచ్చు.