ఎలాంటి హడావుడీ లేకుండా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలనుకుంటే ఎగ్ చపాతీ రోల్స్ బెస్ట్ ఆప్షన్. అవసరానికి తగ్గట్లు గోధుమ పిండి తీసుకోండి. దానిలో ఉప్పు, కొంచెం నూనె వేసి కలపాలి. అనంతరం దానిలో నీళ్లు వేస్తూ పిండిని కలపాలి. ఇలా చేయడం వల్ల చపాతీ మెత్తగా వస్తుంది. ఓ పది నిమిషాలు పక్కన పెట్టి.. ఇప్పుడు వాటిని పూరీలుగా ఒత్తుకోవాలి. వాటిపై కాస్త నూనె అప్లై చేసి.. మడిచి.. మళ్లీ దానిని చపాతీలుగా చేసి రెండువైపులా రోస్ట్ చేయాలి. ఓ గిన్నెలో గుడ్లు పగులగొట్టి వేసి.. బాగా కలుపుకోవాలి. ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఆమ్లెట్‌గా వేసుకోవాలి. కొంచెం తడిగా ఉన్నప్పుడే దానిపై చపాతీ పెట్టుకోవాలి. అది రోస్ట్ అయిన తర్వాత దానిపై మయోనెస్ లేదా టమాటా కెచప్ అప్లై చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు అదే పెనంపై క్యారెట్, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగినవి వేసి వేయించుకోవాలి. కాస్త పెప్పర్, సాల్ట్, నూనె వేసి మగ్గించుకోవాలి. వీటిని ఎగ్ చపాతీపై ప్లేస్ చేయాలి. దానిపై నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చపాతీలను రోల్ చేసి టూత్ పిక్ పెట్టాలి. ఇది లంచ్‌కి, బ్రేక్‌ఫాస్ట్‌కి మంచి టేస్టీ ఛాయిస్ అవుతుంది. (Images Source : Envato)