సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కాస్త టేస్టీగా తినాలనిపిస్తుంది.

ఆ సమయంలో టేస్టీగా, ఆరోగ్యానికి ప్రయోజనాలు అందించే ఫుడ్స్ తీసుకోవడం మంచిది.

వాటిలో స్పైసీ గ్రిల్డ్ చికెన్ రెసిపి ఒకటి. ఇది ప్రోటీన్​కు మంచి ఎంపిక.

చికెన్ బ్రెస్ట్, మెక్సికో చిల్లీ, టోమాటో పేస్ట్, వెల్లుల్లి, ధనియాల పొడి తీసుకోవాలి.

వీటితో పాటు జీరకర్ర పొడి, మిరియాలు, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి.

వీటన్నీంటిని కలిపి చికెన్​కు బాగా పట్టించాలి. వాటిని ఓ అరగంట పక్కన పెట్టేయాలి.

ఇప్పుడు చికెన్​ను గ్రిల్డ్ పాన్​లోకి తీసుకుని ఉడికించాలి. మంట చిన్నగానే ఉండాలి.

ఒకవైపు రోస్ట్ అయ్యాక మరోవైపు తిప్పాలి. ఉడికించే సమయంలో టమోటో పేస్ట్ వేయాలి.

రెండు వైపులా పూర్తిగా ఉడికిన తర్వాత స్టౌవ్ ఆపి.. చికెన్​ను దించేయాలి.

దీనిని సాయంత్రం 7 లోపు తింటే రాత్రి డిన్నర్ చేయాల్సిన అవసరం ఉండదు. (Images Source : Envato)