Akira Nandan Janasena Political Entry | పవర్ స్టార్ వారసుడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడా? |ABP
జనసేనలోకి యువ సేనాని అడుగు పెడుతున్నారా..?
తండ్రి బాటలోనే అకీరా వెన్నంటే వేస్తున్న ఈ అడుగులు దేనికి సంకేతం..?
21 ఏళ్లకు కుర్రాడు అప్పుడే పాలిటిక్స్ లోకి వచ్చే ఏం చేస్తాడు..?
పవర్ స్టార్ వారసత్వాన్ని సినిమాల్లో కాకుండా పొలిటికల్ గా అకీరా చూపించేందుకు రంగం సిద్ధమవుతోందా..?
పిఠాపురం ప్లీనరీలో తేలే సంచలన విషయం ఏంటీ..? దక్షిణాది యాత్రలో తండ్రి వెంటే కొడుకు ఉండటం దేనికి నిదర్శనం..ఈ వీడియోలో తెలుసుకుందాం.
అకీరా నందన్ వయస్సు ఈ ఏప్రిల్ కి 21 వస్తాయి. పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ ల కుమారుడైన అకీరా...చిన్నతనం నుంచి తల్లి పెంపకంలో పెరిగాడు. తండ్రి సినిమాలతో బిజీ కావటం...ఆయనకున్న అసంఖ్యాకమైన అభిమాన గణం..జనసైన్యం...వీటన్నింటికి దూరంగా అకీరాను రేణూ దేశాయ్ హైదరాబాద్, పుణేలలో పెంచారు. కానీ ఎప్పుడైతే అకీరాకు ఓటుహక్కు ఏజ్ వచ్చిందో అప్పటి నుంచి తండ్రి వెంటే నడవటం మొదలుపెట్టాడు. ఇది అకీరాకే కాదు జనసేనకూ చారిత్రక అవసరం కానుందా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.





















