అన్వేషించండి

YSRCP Ugadi: జగన్‌కు రాజపూజ్యం 1, అవమానం 7 - వైసీపీ కార్యాలయ ఉగాది వేడుకల్లో సిద్ధాంతి పంచాంగం

YSRCP Panchangam: ఉగాది వేడుకల్లో వైసీపీ ఆఫీసులో చేసిన పంచాంగ శ్రవణం జగన్‌కు ఇబ్బందికరంగా మారింది. ఆయనకు రాజపూజ్యం ఒకటే ఉండగా అవమానం మాత్రం ఏడు ఉంటుందని సిద్ధాంతి తేల్చారు.

Ugadi celebrations at YSRCP office: తాడేపల్లిలోని వైఎస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో  శ్రీ పరాభవ నామ సంవత్సర  ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణంలో సిద్ధాంతి గంటా మురళీకృష్ణ ప్రసాద్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతక ఫలాలను విశ్లేషించారు. ఈ ఏడాది జగన్‌కు గ్రహ గతులు అంత సానుకూలంగా లేవని చెప్పారు.  ముఖ్యంగా  రాజపూజ్యం 1  ఉండగా,  అవమానం 7 గా ఉందని ఆయన తేల్చి చెప్పారు. అలాగే ఆర్థిక పరంగా ఆదాయం 8 ఉండగా, వ్యయం 11 గా నమోదైందని వివరించారు.                              

సిద్ధాంతి విశ్లేషణ ప్రకారం.. ఈ ఏడాది జగన్ వ్యక్తిగత, రాజకీయ జీవితంలో అనేక సవాళ్లు ఎదురుకానున్నాయి. గౌరవ మర్యాదల కంటే విమర్శలు, ప్రతికూలతలు అధికంగా ఉండే అవకాశం ఉందని పంచాంగం స్పష్టం చేస్తోంది. రాజకీయంగా ప్రత్యర్థుల నుంచి ఒత్తిడి పెరగవచ్చని, ప్రతి అడుగులోనూ ఆచితూచి వ్యవహరించాలని  సిద్ధాంతి సూచించారు. గ్రహ దోషాల ప్రభావం ఉన్నందున తగిన శాంతి పూజలు, పరిహారాలు చేసుకోవాలని ఆయన సూచించారు.                                 

అయితే, ఈ ప్రతికూలతలు శాశ్వతం కావని, సెప్టెంబర్ తర్వాత పరిస్థితుల్లో సానుకూల మార్పులు వచ్చే అవకాశం ఉందని పండితులు ఆశాభావం వ్యక్తం చేశారు. సంకల్ప బలంతో పాటు దైవబలం తోడైతే ఎదురయ్యే అడ్డంకులను అధిగమించవచ్చని పేర్కొన్నారు. రాజకీయాల్లో పట్టుదల వదలకూడదని, పరిహార మార్గాలను అనుసరిస్తూ ముందుకు సాగాలని జగన్‌కు సూచించారు.అదే సమయంలో   జగన్ జాతక రీత్యా ఈ ఏడాది రాజకీయంగా పెను సవాళ్లు ఎదురవుతాయని పేర్కొంటూనే, కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది కేంద్ర ,  రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు తలెత్తే సూచనలు బలంగా ఉన్నాయని సిద్ధాంతి విశ్లేషించారు. గ్రహాల సంచారం అనుకూలంగా లేకపోవడం వల్ల పాలనాపరమైన అంశాల్లో, నిధుల కేటాయింపుల విషయంలో కేంద్రంతో ఘర్షణ వాతావరణం ఏర్పడవచ్చని తెలిపారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీయవచ్చని చెప్పారు.   

ఈ ఉగాది వేడుకల్లో  వైఎస్ జగన్ దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జగన్‌తో పాటు ఆయన సతీమణి భారతి రెడ్డి కూడా ఈ పంచాంగ శ్రవణానికి హాజరై  పంచాంగాన్ని ఆలకించారు. అనంతరం వేద పండితులు జగన్ దంపతులకు ఆశీర్వచనాలు అందించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరగాలని కోరుకుంటూ జగన్ ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు.         

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
Ongole Politics: కూటమి ఎమ్మెల్యేనే టార్గెట్ చేస్తున్న బాలినేని - కోవర్ట్ అంటున్న దామచర్ల - టీడీపీ, జనసేనకు మరో గండం తప్పదా?
కూటమి ఎమ్మెల్యేనే టార్గెట్ చేస్తున్న బాలినేని - కోవర్ట్ అంటున్న దామచర్ల - టీడీపీ, జనసేనకు మరో గండం తప్పదా?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
Embed widget