Pawan Kalyan Maha kumbh 2025 | ప్రయాగ్ రాజ్ లో ఫ్యామిలీతో పవన్ కళ్యాణ్ | ABP Desam
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో పాల్గొన్నారు. తన భార్య అన్నా లెజినోవా, కొడుకు అకీరానందన్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి మహాకుంభమేళాకు వెళ్లిన పవన్ అక్కడ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరించారు. సనాతన మాలలో ఉన్న పవన్ కళ్యాణ్ జంధ్యం ధరించి ఒంటిపై షర్ట్ లేకుండా సంప్రదాయాన్ని అనురిస్తూ పవిత్ర స్నానం చేశారు. పవన్ తో పాటు డైరెక్టర్ త్రివిక్రమ్, అకీరా, అన్నా లెజినోవా కూడా త్రివేణి సంగమంలో మునిగి 144ఏళ్లకోసారి వచ్చే వేడుకలో భాగస్వామ్యమయ్యారు. మహా కుంభమేళా నిర్వహిస్తున్న తీరు చూస్తుంటే అత్యద్భుతంగా ఉందన్నారు పవన్ కళ్యాణ్. ప్రత్యేకించి ఉత్తప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి కేంద్రం నుంచి వీరికి సహాయసహకారాలు అందిస్తున్న మోదీ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. కోట్లాది మంది భక్తులు వస్తున్నా వీలైనంత ఇబ్బంది లేకుండా వాళ్లంతా పుణ్య స్నానాలు ఆచరించేలా చేయటం నిజంగా గొప్ప విషయం అన్నారు పవన్ కళ్యాణ్.





















