YSRCP : సత్యవర్థన్ స్టేట్‌మెంటే బ్లాస్టింగ్ - పాత విషయం కొత్తగా చెప్పిన వైఎస్ఆర్‌సీపీ
Andhra Politics: టీజర్ ఇచ్చి బ్లాస్టింగ్ న్యూస్ చెప్పిన వైఎస్ఆర్‌సీపీ. సత్యవర్ధన్ కోర్టులోఇచ్చిన స్టేట్‌మెంట్ సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది.

YSRCP Blast: మంగళవారం సాయత్రం ఏడు గంటలకు బ్లాస్టింగ్ విషయాన్ని వెల్లడిస్తామని ప్రకటించింది. ఆ ప్రకారం ఏడుగంటలకు ఓ పోస్టు పెట్టింది. వంశీ అరెస్టు లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ కుట్రలు చేసిందని సత్యవర్థన్ కోర్టులో ఇచ్చిన స్టేట్‌మెంట్ ను బయట పెట్టారు. గన్నవరం కేసులో కట్టుకథలు, కల్పితాలు, తప్పుడు సాక్ష్యాలు, అక్రమ అరెస్టులు అని మండిపడింది. దానికి కోర్టు ముందు సత్యవర్థన్ స్టేట్‌మెంటే అందుకు నిదర్శనమని తెలిపింది.
బ్లాస్టింగ్ విషయాన్ని ట్రూత్ బాంబ్ అని ప్రకటించిన వైసీపీ
చంద్రబాబు సర్కార్ కుట్రను సత్యవర్థన్ ఫిబ్రవరి 10, 2025 నాటు సత్యవర్ధన్ ఇచ్చిన స్టేట్‌మెంటే సాక్ష్యమని తెలిపింది. ఘటన జరిగిన సమయంలో తాను అక్కడలేనన్న సత్యవర్థన్ స్టేట్ మెంట్లో చెప్పారు. టీడీపీ నాయకుడు బచ్చుల సుబ్రహ్మణ్యం ఈ కేసులో సాక్షిగా తన వద్ద సంతకం తీసుకున్నాడని సత్యవర్ధన్ తెలిపారు. ఇలా తాను కోర్టు ముందుకు వచ్చి స్టేట్ మెంట్ ఇవ్వడానికి తనను ఎవరూ బలవంతం పెట్టలేదని కూడా కోర్టులో సత్యవర్ధన్ వెల్లడించారని వైసీపీ తెలిపింది.
💣 Truth Bomb 💣
— YSR Congress Party (@YSRCParty) February 18, 2025
వంశీ అరెస్టు లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ కుట్రలు
- గన్నవరం కేసులో కట్టుకథలు, కల్పితాలు, తప్పుడు సాక్ష్యాలు, అక్రమ అరెస్టులు
- కోర్టు ముందు సత్యవర్థన్ స్టేట్‌మెంటే అందుకు నిదర్శనం
- చంద్రబాబు సర్కార్ కుట్రను బయటపెట్టిన సత్యవర్థన్ ఫిబ్రవ… pic.twitter.com/H5hseJpSv0
టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టు చేశారంటున్న వైసీపీ
గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వల్లభనేని వంశీ మోహన్ ను అరెస్టు చేయలేదు. ఆయన ఫిర్యాదుదారు అయిన సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించి ..కేసును వెనక్కి తీసుకునేలా చేశారన్న కారణంతో అరెస్టు చేశారు. అయితే హాఠాత్తుగా ఆయన పేరును గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో చేర్చి అరెస్టు చేశారని వైసీపీ అంటోంది.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో ఏమాత్రం ప్రమేయం లేని వంశీని హఠాత్తుగా నిందితునిగా చేర్చి అరెస్ట్ చేశారు. ఇదంతా కేవలం రాజకీయ దురుద్దేశంతో చేసిన అరెస్ట్ అని స్పష్టంగా తెలుస్తోంది.#APisNotinSafeHands#CBNFailedCM#TDPGoons#IdhiMunchePrabhutvam#SadistChandraBabu… pic.twitter.com/mrUyEJlD3T
— YSR Congress Party (@YSRCParty) February 18, 2025
సత్యవర్ధన్ కిడ్నాప్ వీడియోల్నీ రిలీజ్ చేసిన టీడీపీ
ఫిర్యాదుదారు సత్యవర్ధన్ తో బెదిరించి ఆ స్టేట్ మెంట్ ఇప్పించారని టీడీపీ ఆరోపిస్తోంది. ఇప్పటికే సత్యవర్ధన్ ను వంశీ తీసుకెళ్తున్న దృశ్యాలను ఆ పార్టీ విడుదల చేసింది. సత్యవర్ధన్ కోర్టులో అలాంటి స్టేట్ మెంట్ ఇచ్చారని తెలిసిన తర్వాతనే ఈ వివాదం అంతా జరుగుతోంది.కొత్తగా ఇలా స్టేట్ మెంట్ ఇచ్చారని వైసీపీ బ్లాస్టింగ్ అని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
Also Read: సత్యవర్థన్‌ను వంశీ ఇంటికి తీసుకెళ్లిన అనుచరులు - సంచలన వీడియో రిలీజ్ చేసిన టీడీపీ





















