Making Of 'Chhaava' Video: 6 నెలలు.. రోజుకు 8 గంటల ట్రైనింగ్ - ది మేకింగ్ ఆఫ్ 'ఛావా' వీడియో చూశారా?
Chhaava Making Video: విక్కీ కౌశల్, రష్మిక లేటెస్ట్ హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్ 'ఛావా'. ఈ మూవీలో శంభాజీ పాత్ర కోసం విక్కీ చాలా కష్టపడ్డారు. ఈ క్రమంలో మూవీ టీం మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది.

Vicky Kaushal's Chhaava Making Video: బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక నటించిన లేటెస్ట్ హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్ 'ఛావా' (Chhaava). ఈ నెల 14న విడుదలైన సినిమా హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ (Vicky Kaushal), ఆయన భార్య యేసుబాయి పాత్రలో రష్మిక (Rashmika Mandanna) నటనకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో చిత్ర బృందం 'మేకింగ్ ఆఫ్ ఏ వారియర్ కింగ్' పేరుతో 'ఛావా' వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 2 నిమిషాలపైన ఉన్న వీడియోలో మూవీ టీం, ముఖ్యంగా విక్కీ కౌశల్ పడ్డ కష్టాన్ని కళ్లకు కట్టినట్లు ఈ వీడియోలో చూపించారు.
'ఛావా'లో శంభాజీ మహరాజ్‌గా కనిపించేందుకు విక్కీ కౌశల్ ఆరు నెలల చొప్పున రోజుకు 8 గంటలు కేవలం శిక్షణ కోసమే కేటాయించారు. ప్రాథమిక అంశాలతో స్టార్ట్ చేసి గుర్రపు స్వారీలో ఎన్నో మెళకువలు నేర్చుకున్నారు. ఇక కత్తిసాములో నైపుణ్యం కోసం తనదైన రీతిలో కష్టపడ్డారు. యుద్ధంలో కత్తితో పాటు డాలు, చాకు, బల్లెం ఎలా ఉపయోగించాలో యాక్షన్ కొరియోగ్రాఫర్ల సూచనల మేరకు తగిన ట్రైనింగ్ తీసుకున్నారు. శరీరం ధృఢంగా కనిపించేందుకు కండలు పెంచడమే కాకుండా 100 కేజీల వరకూ బరువు పెరిగారు. ఇందుకోసం జిమ్‌లో ఎంతో కష్టపడ్డారు. 'శంభాజీ' పాత్ర కోసం అయిన ట్రైనింగ్‌లో తన జీవితంలో ఎంతో డిసిప్లీన్ అలవడిందని విక్కీ చెప్పారు.
'ఛావా' రికార్డు కలెక్షన్లు
లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన 'ఛావా'.. ప్రీ సేల్ బుకింగ్స్‌లోనే 5 లక్షల టికెట్స్‌తో హవా చూపించింది. తొలి రోజు రూ.31 కోట్లు వసూలు చేసిన సినిమా ఈ ఏడాది బాలీవుడ్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. దాదాపు రూ.130 కోట్ల భారీ బడ్జెట్‌తో దినేశ్ విజన్ సినిమాను నిర్మించగా.. ఇప్పటి వరకూ రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా కీలక పాత్రల్లో నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకే హైలెట్‌గా నిలిచింది.
ఆడియన్స్ ఎమోషన్స్.. కన్నీళ్లతో..
View this post on Instagram
Chhaava Movie: 'छावा' पाहायला घोड्यावरून संभाजीराजांची वेषभूषा धारण करत आला तरुण...थेट चित्रपट गृहात एन्ट्री, व्हिडिओ पाहा #Chhaava #ChhaavaInCinemas #ChhaavaReview pic.twitter.com/Lihl3RBLXo
— sandip kapde (@SandipKapde) February 14, 2025
'ఛావా' మూవీని చూసిన ఆడియన్స్.. 'శంభాజీ మహరాజ్'గా విక్కీ కౌశల్, యేసుబాయిగా రష్మిక పెర్ఫార్మెన్స్‌కు ఫిదా అవుతున్నారు. సినిమాను చూసి బయటకు వచ్చి ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా.. ఈ సినిమాను చూసిన చిన్నారి చేసిన నినాదాలతో థియేటర్‌లో అంతా ఎమోషన్‌కు గురయ్యారు. 'శంభాజీ మహరాజ్‌కు జై', 'జై భవానీ'.. నినాదాలతో థియేటర్ మొత్తం దద్దరిల్లింది. ఈ చిన్నారి వీడియోను షేర్ చేసిన హీరో విక్కీ కౌశల్.. 'ఇది మేము సొంతం చేసుకున్న నిజమైన గౌరవం.' అని పేర్కొన్నారు. నాగపూర్‌లో ఓ అభిమాని ఏకంగా గుర్రంపై శంభాజీ వేషధారణలో స్క్రీన్ ముందుకు వచ్చి కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

