Pushpa 2 OTT Streaming: ఇండియన్ సినిమా హిస్టరీలో 'పుష్ప 2' రికార్డు - సెకండ్ ప్లేస్‌లో కలెక్షన్స్, మరో 5 విదేశీ భాషల్లో స్ట్రీమింగ్
Pushpa 2 OTT Platform: 'నెట్ ఫ్లిక్స్'లో టాప్ ట్రెండింగ్‌లో ఉన్న అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీ తాజాగా పలు విదేశీ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. రూ.1871 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మూవీ టీం తెలిపింది.

Allu Arjun's Pushpa 2 Now Streaming In Five More Foreign Languages In Netflix: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప 2: ది రూల్' (Pushpa 2) గతేడాది డిసెంబర్ 5న విడుదలై రికార్డులు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం 'నెట్‌ఫ్లిక్స్'లో (Netflix) జనవరి 30 నుంచి భారతీయ భాషల్లో స్ట్రీమింగ్ అవుతూ డిజిటల్ సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఇంగ్షీష్ వెర్షన్ సైతం ప్రారంబించగా గ్లోబల్ ప్రేక్షకులకు సైతం మరింత దగ్గరైంది. ఇదే జోరులో పలు విదేశీ భాషల్లోనూ 'పుష్ప 2'ను నెట్ ఫ్లిక్స్ తాజాగా స్ట్రీమింగ్ చేస్తోంది. బ్రెజీలియన్, పోర్చుగీస్, ఇండోనేషియా, పోలిష్, స్పానిష్, థాయ్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. సబ్ టైటిల్స్ ఇంగ్లీష్‌లో అందుబాటులో ఉంటాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన సినిమాలో అల్లు అర్జున్ తన నట విశ్వరూపం చూపించారు.
మైత్రీ మూవీ మేకర్స్ నవీన్, రవిశంకర్ చిత్రాన్ని నిర్మించారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకు స్పెషల్ హైప్ తీసుకొచ్చింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా ఫుల్ ట్రెండ్‌లో కొనసాగుతుండగా.. ఓటీటీ కోసం మేకర్స్ రీలోడెడ్ వెర్షన్ పేరుతో అదనంగా మరో 24 నిమిషాల సీన్లను కలిపారు. దీంతో మొత్తం 3:40 గంటల మూవీ స్ట్రీమింగ్ అవుతుండగా ఓటీటీ లవర్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
రప్పా.. రప్పా.. రికార్డులను దాటేసింది
Shattering many records and creating new records, #Pushpa2TheRule stands tall as INDIAN CINEMA'S INDUSTRY HIT ❤️🔥#Pushpa2TheRule grosses 1871 CRORES WORLDWIDE 💥💥
— Mythri Movie Makers (@MythriOfficial) February 18, 2025
RECORDS RAPA RAPAA 🔥#Pushpa2#WildFirePushpa
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil… pic.twitter.com/mWoLOa123e
'పుష్ప 2' థియేట్రికల్ రన్ దాదాపు పూర్తి కాగా ప్రపంచవ్యాప్తంగా ఫైనల్ కలెక్షన్స్‌ను మేకర్స్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులను రప్పా.. రప్పా.. రప్పా.. అంటూ దాటుకుంటూ వచ్చేసిందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 75 రోజుల్లో రూ.1871 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలిపింది. 2024లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా 'పుష్ప 2' నిలవడమే కాకుండా.. మూవీ విడుదలైన 6 రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి భారతీయ మూవీగా నిలిచింది. ఈ సినిమాకు బాలీవుడ్‌లోనే ఎక్కువ కలెక్షన్లు వచ్చినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
కేవలం హిందీ బెల్ట్‌లోనే రూ.850 కోట్లకు పైగా వసూలు చేసి 100 ఏళ్ల బాలీవుడ్ చరిత్రలో ప్రత్యేక స్థానం దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు దక్కించుకున్న భారతీయ చిత్రాల్లో 'పుష్ప 2' రెండో స్థానంలో నిలిచింది. ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో దంగల్ (రూ.2024 కోట్లు) టాప్‌లో కొనసాగుతోంది. రెండో స్థానంలో పుష్ప 2 (రూ.1875 కోట్లు), మూడో స్థానంలో బాహుబలి 2 (రూ.1810 కోట్లు) ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఆర్ఆర్ఆర్ (రూ.1,387 కోట్లు), కేజీఎఫ్ 2 (రూ.1250 కోట్లు), కల్కి 2898 ఏడీ (రూ.1153 కోట్లు), జవాన్ (రూ.1148 కోట్లు), పఠాన్ (రూ.1050 కోట్లు) వరుసగా ఉన్నాయి.





















