SKN: 'జోక్‌ను జోక్‌లా తీసుకోండి.. తప్పుడు ప్రచారం వద్దు' - తెలుగుమ్మాయిల కామెంట్స్‌పై 'బేబీ' నిర్మాత ఎస్కేఎన్ వివరణ
Producer SKN: 'డ్రాగన్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ తెలుగమ్మాయిలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా.. దీనిపై క్లారిటీ ఇస్తూ ఆయన తాజాగా ఓ వీడియో విడుదల చేశారు.

Producer SKN Video About Clarification On Telugu Heroines: 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత 'ఎస్కేఎన్' (Sreenivasa Kumar) తెలుగమ్మాయిలపై చేసిన వ్యాఖ్యలు వైరలైన సంగతి తెలిసిందే. తాజాగా వీటిపై స్పష్టత ఇస్తూ ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. తెలుగు ఇండస్ట్రీకి తాను ఎంతో మంది అమ్మాయిలను పరిచయం చేశానని చెప్పారు. 'ఇటీవల జరిగిన ఈవెంట్‌లో నేను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇప్పటికే దాదాపు 8 మంది తెలుగు వారిని సిల్వర్ స్క్రీన్‌కు పరిచయం చేశాను. భవిష్యత్తులో మరో 25 మంది ప్రతిభావంతులైన తెలుగమ్మాయిలను టాలీవుడ్‌కు పరిచయం చేస్తాను. తెలుగు వారి ప్రతిభను ప్రోత్సహించడం ఎల్లప్పుడూ నా ప్రాధాన్యతగా భావిస్తున్నా.
Hi everyone, Namaste. I am one of the few producers who have introduced Many Telugu actresses to the industry. A lighthearted comment I made recently was misunderstood, leading to unnecessary headlines with incorrect meanings.
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) February 18, 2025
To clarify, I have introduced 8 talented individuals… pic.twitter.com/raWN8Suvpk
నా తర్వాత 3 సినిమాల్లోని టీంలో చాలామంది తెలుగమ్మాయిలు ఉన్నారు. ఏదో ఫన్ బౌండరీలో చేసిన కామెంట్స్‌ను ఓ స్టేట్‌మెంట్‌లా రుద్దేసి తప్పుడు ప్రచారం చెయ్యొద్దు. జోక్‌ను జోక్‌లా తీసుకోవాలి తప్ప నెగిటివ్ స్ప్రెడ్ చెయ్యొద్దు. ఈ వివాదాన్ని ఇక్కడితో ముగిస్తున్నా. ఇక ఎటువంటి ప్రచారానికి తావివ్వొద్దు.' అంటూ ఎస్కేఎన్ వీడియోలో పేర్కొన్నారు.
Also Read: 'ఆహా'తో పాటు మరో ఓటీటీలోకి వరుణ్ సందేశ్ సైకలాజికల్ థ్రిల్లర్ 'విరాజి' - డబ్బులు కట్టి చూస్తారా మరి?
అసలు ఎస్కేఎన్ ఏమన్నారంటే.?
తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన లవ్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'డ్రాగన్'. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కించగా.. 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' పేరుతో తెలుగులో ఈ సినిమా విడుదల చేస్తున్నారు. ఈ నెల 21న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా.. తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ కానుంది. 'డ్రాగన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 16న హైదరాబాద్‌లో జరగ్గా.. నిర్మాత ఎస్కేఎన్ సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. 'తెలుగు వచ్చిన అమ్మాయిల కంటే తెలుగు రాని అమ్మాయిలని మేము ఎక్కువగా ఇష్టపడతాం.
తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఏమవుతుంది అనే విషయం నాకు తర్వాత తెలిసింది. అందుకని తెలుగు రాని అమ్మాయిలనే ఎంకరేజ్ చేయాలని నేను, మా కల్ట్ డైరెక్టర్ సాయి రాజేష్ అనుకుంటున్నాము' అంటూ కామెంట్స్ చేశారు. దీనిపై నెటిజన్లు ట్రోల్ చేశారు. ఎస్కేఎన్, సాయిరాజేష్ కాంబోలో వచ్చిన 'బేబీ' మూవీ హీరోయిన్ వైష్ణవీ చైతన్యను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారనే ట్రోలింగ్ నడిచింది. దీనిపైనే ఆయన తాజాగా వీడియోలో వివరణ ఇచ్చారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

