Ziddi Girls Web Series OTT Release Date: కాలేజీలో ఐదుగురు అమ్మాయిల రచ్చ - ఆ ఓటీటీలోకి కొత్త అడల్ట్ డ్రామా సిరీస్, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Ziddi Web Series OTT Platform: కాలేజీ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన లేటెస్ట్ అడల్ట్ డ్రామా సిరీస్ జిడ్డీ గర్ల్స్. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ విడుదల కాగా.. ఈ నెల 27 నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ కానుంది.

Ziddi Girls Romantic Web Series OTT Release Date On Amazon Prime Video: కాలేజీలో ఐదుగురు అమ్మాయిలు చేసిన రచ్చతో పాటు కాస్త రొమాంటిక్ టచ్ ఇచ్చిన లేటెస్ట్ అడల్ట్ వెబ్ సిరీస్ 'జిడ్డీ గర్ల్స్' (Ziddi Girls). తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. యూత్‌ను ఎంటర్‌టైన్ చేసేలా కాస్త అడల్ట్ కంటెంట్‌తో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్‌లో అతియా తారానాయక్, ఉమాంగ్ బదానియా, జైనా అలీ, దీయా దామిని, అనుప్రియ కరోలీ ప్రధాన పాత్రలు పోషించారు. పాపులర్ రేవతి, సిమ్రన్, నందితాదాస్ కీలక పాత్రల్లో నటించారు. ఢిల్లీలోని ఓ కాలేజీ బ్యాక్ డ్రాప్‌లో ఈ సిరీస్ కొనసాగుతుంది. ఆ కళాశాలలో స్ట్రిక్స్ రూల్స్ అమలవుతుండగా.. అక్కడ చదివేందుకు వచ్చిన ఐదుగురు అమ్మాయిలు వాటిని వ్యతిరేకిస్తారు. కట్టుబాట్లను ధిక్కరించి రెబల్స్‌గా ప్రవర్తిస్తారు.
దీంతో యూనివర్శిటీలో క్లాష్ ఏర్పడి సవాళ్లు ఎదురవుతాయి. వీటిని అమ్మాయిలు ఎలా అధిగమించారు..?, అసలు ఆ కాలేజీలో ఉన్న రూల్స్ ఏంటి.?, చివరకు అమ్మాయిల ప్రొటెస్ట్‌తో కాలేజీ రూల్స్‌లో మార్పులు వచ్చాయా.? అనేది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే. ప్రెండ్ షిప్, రిలేషన్స్, ఎమోషన్స్ వంటివి ఎక్కువగా ఉన్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. దీంతో పాటే కాస్త ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఇబ్బంది పెట్టేలా కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయి.
ఈ నెల 27న స్ట్రీమింగ్
ఈ నెల 27వ తేదీ నుంచి 'జిడ్డీ గర్ల్స్' వెబ్ సిరీస్ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు స్ట్రీమింగ్ డేట్‌ను సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా రివీల్ చేసింది.
ఈ వారమే బాలీవుడ్ మూవీ స్ట్రీమింగ్
వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ హీరో హీరోయిన్లుగా నటించిన బాలీవుడ్ మూవీ 'బేబీ జాన్' ఈ నెల 20న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంతోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు కీర్తి సురేశ్. ఇప్పటివరకూ ఈ మూవీ రెంటల్ విధానంలో అందుబాటులో ఉండగా.. ఈ నెల 20వ తేదీ నుంచి రెంట్ విధానం తొలిగి రెగ్యులర్ స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉండనుంది. ఈ మూవీకి కలీస్ దర్శకత్వం వహించగా.. గతేడాది డిసెంబర్ 24న థియేటర్లలో రిలీజైంది. తమిళ మూవీ 'తెరి' కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించగా.. తమన్ సంగీతం అందించారు.
Also Read: 'ఆహా'తో పాటు మరో ఓటీటీలోకి వరుణ్ సందేశ్ సైకలాజికల్ థ్రిల్లర్ 'విరాజి' - డబ్బులు కట్టి చూస్తారా మరి?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

