Mamata Banerjee On Kumbha Mela: మమత బెనర్జీ Vs పవన్ కల్యాణ్- మహా కుంభ మేళాపై విమర్శలు
Mamata Banerjee On Kumbha Mela: మహ కుంభ మేళాను నిర్వహించడంలో యూపీ సర్కార్ ఫెయిలయిందని మమత బెనర్జీ ఆరోపించారు. దీన్నో మృత్యు కుంభమేళాగా మార్చేశారని విమర్శించారు.

Mamata Banerjee Latest news: మహూ కుంభమేళాను మృత్యు కుంభమేళాగా యూపీ ప్రభుత్వం మార్చిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ,యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై ఫైర్ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన మమత యూపీ ప్రభుత్వం కుంభమేళా నిర్వహించడంలో విఫలమైందని విమర్శించారు. జనవరి 29వ తేదీన ప్రయోగరాజ్‌లో జరిగిన తొక్కిసలాటలో 30 మంది భక్తులు మృతి చెందారు. 60 మంది గాయపడ్డారు. గత శనివారం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో కుంభమేళాకు వెళ్లే రైలు ఎక్కే క్రమంలో జరిగిన తొక్కిసలాటలో మరో 18 మంది మృత్యువాత పడ్డారు.
కుంభమేళా అసెంబ్లీ వేదికగా పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. మహా కుంభమేళాను, యోగీ ఆధిత్యనాథ్ ప్రభుత్వం మృత్యుకుంభంగా మార్చి వేసిందని ఆరోపించారు. మృతుల సంఖ్యను తక్కువగా చూపించే ప్రయత్నం యూపీప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. ప్రజలు, మీడియా చేసే విమర్శలు నుంచి తప్పించుకునేందుకు వందల మృత దేహాలను దాచి పెట్టారని ఆరోపించారు.
Kolkata: On #MahaKumbh2025, West Bengal CM Mamata Banerjee says, "This is 'Mrityu Kumbh'...I respect Maha Kumbh, I respect the holy Ganga Maa. But there is no planning...How many people have been recovered?...For the rich, the VIP, there are systems available to get camps (tents)… pic.twitter.com/6T0SyHAh0e
— ANI (@ANI) February 18, 2025
ధనికులకు చేసిన ఏర్పాట్లు పేదలకు ఎందుకు చేయలేదు ?
మహా కుంభమేళాను తాను కూడా గౌరవిస్తానని, గంగా మాత అంటే ఎంతో గౌరవమని చెప్పుకొచ్చారు మమతా బెనర్జీ. అయితే యూపీ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను తీవ్రంగా తప్పుబట్టారు. యోగి సర్కార్ సరైన ఏర్పాట్లు చేయలేదని, చేసి ఉంటే ఈ పరిస్థితి ఏర్పడేది కాదని మమత అభిప్రాయపడ్డారు. మహా కుంభమేళాలో వీఐపీ సంస్కృతి నడిచిందని, ధనికుల కోసం లక్ష డేరాలు, చక్కటి ఏర్పాట్లు చేశారన్నారు. అదే రీతిలో పేదలకు ఎందుకు ఏర్పాట్లు చేయలేదని యోగీ సర్కార్‌ను నిలదీశారు. పేద ప్రజలకు అవరమైన కనీస ఏర్పాట్లను యూపీ ప్రభుత్వం చేయలేదని, ఈ మహా కుంభమేళాను నిర్వహించడంలో ఎలాంటి ప్రణాళిక లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: టెస్లా ఇండియా వచ్చేసింది. డ్రైవింగ్ ఎలా ఉందో తెలుసా..?
మమతకు పవన్ కౌంటర్
మమత బెనర్జీ చేసిన కామెంట్స్‌పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. సనాతన ధర్మంపై కామెంట్స్ చేయడం నాయకులకు చాలా ఈజీ అయిపోయిందని మండిపడ్డారు. కోట్ల మంది విశ్వాసాలను దెబ్బతిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్ల మంది ఒక చోటకు చేరినప్పుడు చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. జరిగిన దుర్ఘటనలకు విచారం వ్యక్తం చేయాల్సిందే కానీ విమర్శలు సరికాదని సూచించారు.
#WATCH | Andhra Pradesh Deputy CM Pawan Kalyan says, "...When I was around 16-17 old, I read about Maha Kumbh in Swami Yogananda's autobiography. It had been my desire to visit Maha Kumbh. A lot of spiritual gurus would come here and this has been my long-cherished dream. I am… https://t.co/Fk07lI3Qhd pic.twitter.com/riLkN4H7eo
— ANI (@ANI) February 18, 2025
రికార్డు స్థాయిలో కుంభమేళాకు భక్తులు - యూపీ ప్రభుత్వం
37 రోజుల్లో 55 కోట్ల మంది మహా కుంభమేళాకు వచ్చారని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇది రికార్డుగా యోగీ సర్కార్ పేర్కొంది. గంగ, యుమున, సరస్వతి నదుల సంగం ప్రయాగ్ రాజ్‌లో ఫిబ్రవరి 14 నాటికి 50 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించారని వెల్లడించింది. ఈ నాలుగు రోజుల్లోనే మరో 5 కోట్ల మంది మహా కుంభమేళాకు వచ్చినట్లు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.
Also Read: సుగర్ డేటింగ్ క్యాపిటల్‌గా మారుతున్న ఇండియా - మన డబ్బున్న వాళ్లు అందుకే మొగ్గు చూపుతున్నారా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

