అన్వేషించండి

Medical Imaging Technologies : X-ray, CT స్కాన్, MRIకి మధ్య ఉన్న తేడాలివే.. వీటిలో ఏది బెస్టో తెలుసా?

X-ray : ఏదైనా ఆరోగ్య సమస్యతో ఆస్పత్రికి వెళ్తే డాక్టర్లు చేయించుకోమనే టెస్ట్​ల్లో X-ray, CT స్కాన్, MRIలు ఉంటాయి. ఇంతకీ వీటి మధ్య ఉన్న తేడా ఏంటి? ఏ సమస్యకి వేటిని చేస్తారో తెలుసా?

Difference between X-Ray CT scan and MRI : ఆస్పత్రికి వెళ్తే కొత్త సమస్యలతో పాటు కొత్త పేర్లు వింటూ ఉంటాము. ఒక్కో జబ్బుకి ఒక్కో పేరు ఉంటుంది. అయితే ఏ సమస్యలతో వెళ్లినా.. ముందుగా బ్లడ్ టెస్ట్​లు, X-ray, CT స్కాన్, MRIలంటూ వైద్యులు ముందు ఓ లిస్ట్ రెడీ చేసి ఇస్తారు. అయితే కొందరికీ ఈ టెస్ట్​లు ఏంటో.. ఆ పేర్లు ఏంటో అస్సలు అర్థం కావు. ముఖ్యంగా X-ray, CT స్కాన్, MRIలు దేనికోసం చేస్తారో కూడా తెలీదు. అసలు వీటిని ఎందుకు చేస్తారు? వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి?

X-ray, CT స్కాన్, MRIలను శరీరంలోని భాగాలను లోపలి నుంచి విజులైజ్ చేయడానికి, లోపలి స్ట్రక్చర్స్​ని తెలుసుకోవడానికి ఉపయోగించే మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీలు. వీటి గురించి చాలామందికి సరైన అవగాహన ఉండదు. X-ray ఎందుకు తీస్తారు? CT స్కాన్ దేనికి చేయిస్తారు? MRI దేనికోసం చేస్తారో అంతగా తెలీదు. వాటి మధ్య వత్యాసాలు ఏమిటో? వాటిని ఎందుకు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. 

X-rays

X-రేలను శరీరంలోని ఎముకలను, డెన్స్​ని తెలుసుకోవడానికి ఉపయోగించే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ పద్ధతి. దీనితో ఎముకల్లో వచ్చిన పగుళ్లను, అంటు వ్యాధులను, కణితులను, ఇతర అబ్​నార్మాలిటీస్​ని గుర్తించడానికి ఈ సాంకేతికతను ఉపయోగిస్తారు. వీటిద్వారా ఫలితాలు త్వరగా తెలుసుకోవచ్చు. పైగా ఎక్కువ ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంటాయి. 

CT స్కాన్స్

CT స్కాన్​లు X-raysలకు అడ్వాన్స్ ప్రోసెసింగ్ అని చెప్పొచ్చు. వీటిని శరీరంలోని క్రాస్ సెక్షనల్ ఇమేజ్​ల కోసం ఉపయోగిస్తారు. X-rays కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ వీటి ద్వారా తెలుస్తుంది. ఎముకలు, అవయవాలు, రక్తనాళాలు, మృదు కణాజాలలను CT స్కాన్​లో చూడొచ్చు. ఇంటర్నల్ డ్యామేజ్ అయినా.. ట్యూమర్స్, ఇన్​ఫెక్షన్లు, రక్తం గడ్డకట్టడం వంటి వాటిని నిర్ధారించడానికి ఈ ప్రక్రియ పనిచేస్తుంది. 

MRI 

MRI (Magnetic field and Radio waves to create detailed Images ) దీనిని శరీరంలోని మృదు కణాజాలాలు, అవయవాలు వాటి నిర్మాణాలు.. వాటికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఇమేజ్​ల రూపంలో పొందడానికి ఉపయోగిస్తారు. దీనికోసం స్ట్రాంగ్ మ్యాగ్నటిక్ ఫీల్డ్స్​ని రేడియో తరంగాలను ఉపయోగిస్తారు. ఇవి మృదు కణాజాలాల మధ్య వ్యత్యాసాన్ని క్లియర్​గా చూపిస్తాయి. మెదడు, వెన్నుముక, కీళ్లు, కండరాలను చిత్రించడానికి హెల్ప్ చేస్తుంది. దీనివల్ల అయోనైజింగ్ రేడియేషన్ ఉండదు. కాబట్టి గర్భిణీ స్త్రీలు, పిల్లలకు స్కాన్ చేయడానికి ఇవి మంచి, సురక్షితమైన ఎంపిక. 

అయితే MRI స్కాన్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. పైగా దీని ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. కొన్ని మెడికల్ సమస్యలు ఉన్నవారికి ఇది మంచిది కాదు. ఇంప్లాంట్స్, మెటల్ ఆబ్జెక్ట్స్ ఉన్నవారికి ఇబ్బంది కలిగిస్తుంది. 

X-rays, CT స్కాన్​లకు అయోనైజింగ్ రేడియేషన్​ను ఉపయోగిస్తారు. MRIలో ఇది ఉండదు. MRI మృదు కణాజాలాలను మరింత స్పష్టంగా ఇస్తుంది. CT స్కాన్‌లు ఎముకలు, ఊపిరితిత్తులను ఇమేజింగ్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తాయి. ప్రతి టెక్నాలజికి ఒక్కో ఉపయోగం ఉంటుందని గుర్తించుకోవాలి. 

Also Read : శృంగార సామర్థ్యాన్ని కిల్ చేస్తోన్న కూల్ డ్రింక్స్.. ఎక్కువ తాగకండి బ్రదర్, రన్​అవుట్​ అయిపోతారట

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
Polavaram Project: 2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
Polavaram Project: 2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
Prabhas : షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
Telangana Assembly Sessions: ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
UPI Lite: యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
Visakha News: నిద్రలో పొట్టలోకి పళ్ల సెట్టు - అరుదైన చికిత్స చేసిన విశాఖ వైద్యులు
నిద్రలో పొట్టలోకి పళ్ల సెట్టు - అరుదైన చికిత్స చేసిన విశాఖ వైద్యులు
Embed widget