Romantic Life : శృంగార సామర్థ్యాన్ని కిల్ చేస్తోన్న కూల్ డ్రింక్స్.. ఎక్కువ తాగకండి బ్రదర్, రన్అవుట్ అయిపోతారట
Intimate Life : కూల్ డ్రింక్స్‌ని, కార్బోనేటెడ్ డ్రింక్స్‌ని చాలామంది ఇష్టంగా తాగుతారు. మీరు కూడా అలాంటివారిలో ఒకరా? అయితే మీ లైంగిక జీవితం హ్యాపీగా ఉండాలంటే వీటిని తాగడం ఆపేయాలట. ఎందుకంటే..
Hidden Dangers of Carbonated and Sugary Drinks : వేడి వేడిగా బిర్యానీ తింటే పక్కన కూల్ డ్రింక్ ఉండాల్సిందే. దాహం వేస్తే ఎనర్జీ డ్రింక్ పేరుతో కార్బోనేటెడ్ డ్రింక్. కొందరు రోజూ ఇలా కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. మీరు ఇలా కూల్ కూల్ అనుకుంటూ తాగుతూ ఉంటూ.. అవి కిల్ కిల్ అంటూ మీ లైంగిక సామర్థ్యాన్ని కిల్ చేస్తాయట. అందుకే వాటికి వీలైనంత దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు. అసలు ఈ డ్రింక్స్ సెక్స్లైఫ్ని ఏవిధంగా కిల్ చేస్తాయో? లైంగిక సామర్థ్యంపై ఇవి ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
డీహైడ్రేషన్
కార్బోనేటెడ్ డ్రింక్స్ డీహైడ్రేషన్‌ని పెంచుతాయి. ఇవి దాహం తీర్చడం కాదు.. మరింత పెంచి.. శరీరాన్ని డీహైడ్రేషన్‌కి గురయ్యేలా చేస్తాయి. దీనివల్ల ప్రైవేట్ పార్ట్స్‌కి రక్తప్రసరణ తగ్గిపోతుంది. ఇది లైంగిక సామర్థ్యంపై నెగిటివ్‌గా ఇంపాక్ట్ చూపిస్తుంది. షుగర్ డ్రింగ్స్ తాగడం వల్ల శక్తి తగ్గుతుంది. మీ మూడ్‌ని, శృంగార జీవితంపై నెగిటివ్ ప్రభావం చూపిస్తుంది.
బ్లడ్ షుగర్
కార్బోనేటేడ్ డ్రింక్స్‌లో షుగర్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ఈ స్వింగ్స్ వల్ల ఎనర్జీ డౌన్ అవుతుంది. మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల శరీరంలో లిబిడో తగ్గిపోతుంది. లిబిడో.. లైంగిక జీవితానికి హార్ట్ వంటిది. దాని స్థాయిలు తగ్గుతున్నాయంటే.. శృంగార జీవితం పరంగా మీరు వీక్ అవుతున్నారని అర్థం. ఇవి శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను కూడా ప్రభావితం చేసి.. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఇవి లైంగికంగా ప్రేరేపించే హార్మోన్లను ఉత్పత్తి చేయడాన్ని నిలిపేస్తాయి.
హార్మోన్స్‌పై ప్రభావం
ఎసిడిటీ ఉంటే చాలామంది ఈ డ్రింక్స్ తాగుతారు. వీటివల్ల సమస్య తగ్గడం కాదు.. ఇంకా ఎక్కువ పెరుగుతుంది. కార్బోనేటేడ్ డ్రింక్స్‌లో pH లెవెల్స్ తక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో ఎసిడిటీని పెంచుతాయి. ఇది శరీరంలో సహజమైన pH సమతుల్యతను దెబ్బతీస్తుంది. దీనివల్ల హార్మోన్ల ఉత్పత్తిపై ప్రభావం పడి.. అది శృంగార జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. వీటిలో షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల హార్మోనల్ సమస్యలు ఎక్కువై.. కార్టిసాల్‌ను విడుదల చేస్తాయి. ఇది ఒత్తిడిని పెంచే హార్మోన్. ఇది సెక్స్ డ్రైవ్‌కు అవసరమైన టెస్టోస్టిరాన్‌ను తగ్గించేస్తుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
హైడ్రేటెడ్‌గా ఉండేందుకు నీటిని రోజుకు 8 నుంచి 9 గ్లాసులైనా తాగాలి. షుగర్ డ్రింక్స్, కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్ తాగడాన్ని పూర్తిగా మానేయాలి. పోషకాలు ఎక్కువగా ఉండే డైట్‌ని ఫాలో అవ్వాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు, హెల్తీ ఫ్యాట్స్ తీసుకోవాలి. రోజూ వ్యాయామం చేస్తే పూర్తి ఆరోగ్యంతో పాటు లైంగిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఒత్తిడిని తగ్గించుకునేందుకు మెడిటేషన్, యోగా, నచ్చిన వ్యక్తితో మాట్లాడటం, డీప్ బ్రీతింగ్ వంటివి చేయాలి.
ఈ టిప్స్ రెగ్యులర్‌గా ఫాలో అవుతూ.. కార్బోనేటెడ్, షుగర్, కూల్ డ్రింక్స్‌ను తాగడం మానేస్తే లైంగిక జీవితం మెరుగుపడుతుంది. అంతేకాకుండా పూర్తి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
Also Read : NNN లేదా ఇతర కారణాల వల్ల ఆ పనికి గ్యాప్ వస్తే.. మళ్లీ స్టార్ట్ చేసేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.