Weight Loss Mistakes to Avoid : బరువు తగ్గడానికి చేసే రెగ్యులర్ మిస్టేక్స్ ఇవే.. అలా చేస్తే బరువు తగ్గరట, జాగ్రత్త సుమీ
Weight Loss : బరువు తగ్గుతామనే భ్రమలో చాలామంది తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. వాటివల్ల బరువు తగ్గకపోవడమే కాకుండా.. ఆరోగ్యానికి ఎన్నో సమస్యలు వస్తాయట. అవేంటంటే..

Weight Loss Journey : బరువు తగ్గాలనుకున్నప్పుడు తెలియకుండానే.. ఇలా చేస్తే బరువు తగ్గిపోతామనే భ్రమలో కామన్‌గా కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. వాటి వల్ల బరువు తగ్గడం అటుంచితే.. ఇంకా బరువు పెరుగుతారట. బోనస్‌గా ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయంటున్నారు నిపుణులు. ఇంతకీ కామన్ బరువు తగ్గడం కోసం చేసే మిస్టేక్స్ ఏంటో? వాటిని ఎలా అవాయిడ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫోకస్ దాని మీదే..
బరువు తగ్గాలనుకునేవారు ముందు చేసేది ఏది అంటే.. బరువును రోజూ చెక్ చేసుకోవడం. ఎలాంటి మార్పు లేకపోతే డిజప్పాయింట్ అవ్వడం. ఇలా చేయడం వల్ల బరువు తగ్గడం అటుంచి.. స్ట్రెస్ ఎక్కువైపుతుందట. బరువు హెచ్చుతగ్గులకు నీరు, కండరాల పెరుగుదల, హార్మోన్స్ ప్రభావం ఉంటుందని గుర్తించుకోవాలి. దానిని ట్రాక్ చేయడం మంచిదే కానీ.. రోజూ ట్రాక్ చేయడం వల్ల స్ట్రెస్ పెరుగుతుంది. రెండువారాలకో.. నెలకో ఓసారి చెక్ చేసుకుంటే.. కరెక్ట్ రిజల్ట్స్ తెలుస్తాయి.
తినడం మానేయడం..
కేలరీలు తగ్గించాలనే ఉద్దేశంతో చాలామంది ఫుడ్ తినడాన్ని మానేస్తారు. దీనివల్ల బరువు తగ్గరు. కండరాల నష్టం ఏర్పడుతుంది. మెటబాలీజం తగ్గుతుంది. జీవక్రియ తగ్గితే బరువు తగ్గడం చాలా కష్టమవుతుంది. అంతేకాకుండా అతిగా తినే అలవాటు పెరుగుతుంది.
ఎక్కువ జిమ్ చేయడం..
బరువు తగ్గడం కోసం జిమ్ జాయిన్ అయ్యి.. కనీసం విశ్రాంతి ఇవ్వకుండా ఎక్కువగా వర్క్అవుట్స్ చేస్తారు. కార్డియో రెగ్యులర్‌గా చేస్తూ ఉంటారు. దీనివల్ల కండరాలకు నష్టం జరుగుతుంది. కాబట్టి స్ట్రెంత్ పెంచుకుంటూ.. కార్డియో చేస్తే మంచిఫలితాలుంటాయి. ఒకరోజు స్ట్రెంత్ కోసం.. మరొకరోజు కార్డియో కోసం కేటాయించుకుంటే మజిల్ బిల్డ్ అయి.. కొవ్వు తగ్గుతుంది.
ఫ్యాడ్ డైట్స్..
డైట్ పేరుతో ఫుడ్‌కి దూరంగా ఉంటే స్వల్పకాలిక ఫలితాలు చూస్తారు. కానీ.. ఇవి మళ్లీ బరువు పెరిగేలా చేస్తాయి. ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి. కాబట్టి ఫుడ్‌ని తీసుకునే విధంగా లిమిటెడ్‌గా తీసుకుంటే బరువు తగ్గుతారు.
ప్రొటీన్ తీసుకోకుంటే..
బరువు తగ్గాలనుకుంటే శరీరానికి కచ్చితంగా ప్రోటీన్ అందించాలి. ఇది మీరు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండడంలో హెల్ప్ చేసి.. కండరాలకు బలం చేకూర్చుతుంది. వయసు పెరిగే కొద్ది కండరాలు క్షీణించకుండా హెల్ప్ చేస్తుంది. ప్రోటీన్ తక్కువ తీసుకుంటే మీరు బరువు తగ్గడం కష్టమవుతుంది.
హెల్తీ ఫ్యాట్ తినకుంటే..
బరువు తగ్గాలనుకున్నప్పుడు ఫ్యాట్స్‌కి దూరంగా ఉంటే మంచిదే. కానీ హెల్తీ ఫ్యాట్ కూడా తీసుకోకుంటే.. బరువు తగ్గడం కష్టం. హార్మోన్ నియంత్రణపై శరీరం పట్టు కోల్పోయి మొత్తం ఆరోగ్యాన్ని ప్రతికూలం గా ప్రభావితం చేస్తుంది. అవకాడో, నట్స్, ఆలివ్ నూనె వంటివి హెల్తీ ఫ్యాట్స్‌గా చేర్చుకోవచ్చు.
నిద్ర
నిద్ర లేకపోవడం వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో కార్టిసాల్ హార్మోన్ విడుదల అవుతుంది. ఇది ఫుడ్ క్రేవింగ్స్ పెంచి.. శరీరంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. ముఖ్యంగా పొట్ట పెరుగుతుంది. కాబట్టి రాత్రుళ్లు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోయేలా చూసుకోండి.
అలా బర్న్ చేసి.. ఇలా
వ్యాయామం చేసే సమయంలో ఎన్ని కేలరీలు బర్న్ అవుతాయో.. కొందరు వర్క్ అవుట్ తర్వాత దానికి రెట్టింపు ఫుడ్ తినేస్తారు. దీనివల్ల బరువు తగ్గడం చాలా కష్టమవుతుంది.
హైడ్రేషన్
డీహైడ్రేషన్ వల్ల ఆకలి ఎక్కువగా వేస్తుంది. నీరు జీర్ణక్రియ, జీవక్రియపై మంచి ఫలితాలు చూపించి బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది కాబట్టి.. వీలైనంత నీరు తాగుతూ ఉండాలి. రోజు రెండు లేదా మూడు లీటర్ల నీళ్లు తాగితే హైడ్రేషన్‌గా ఉండడంతో పాటు.. ఆరోగ్యంగాను బరువుతగ్గుతారు.
అలా తినకూడదు..
భోజనం చేస్తున్నప్పుడు ఎలాంటి భోజనం తింటున్నామో తెలుసుకోవాలి. సెల్‌ఫోన్ వాడుతూ టీవీ చూస్తూ ఫుడ్ తింటే తెలియకుండా ఎక్కువగా తినేస్తారు. కాబట్టి తినేప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా భోజనం చేస్తే మంచిది.
ఈ కామన్ మిస్టేక్స్ కవర్ చేసుకుంటూ.. హెల్తీ లైఫ్‌స్టైల్‌ని లీడ్ కచ్చితంగా బరువు తగ్గుతారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం హెల్తీగా బరువు తగ్గితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read : 50-25-25 డైట్ ప్లాన్.. హెల్తీగా బరువు తగ్గాలంటే భోజనాన్ని ఇలానే చేయాలట
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

