Gold Rate: అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.లక్ష దాటిన బంగారం ధర - రేపో, ఎల్లుండో మన దేశంలోనూ బెంచ్ మార్క్
Gold Lakh: పది గ్రాముల మేలిమి బంగారం ధర లక్షకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 3404 డాలర్లకు చేరుకుంది.

Gold Pirce one lakh rupees: బంగారం ధర రికార్డు స్థాయికి చేరింది. పది గ్రాముల మేలిమి బంగారం లక్షకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం 3404 డాలర్లకు చేరింది. ఔన్స్ అంటే దాదాపుగా 29 గ్రాములు. ఈ లెక్కను రూపాయల్లోకి మారిస్తే పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర లక్షకు చేరినట్లయింది. అయితే దేశీయ మార్కెట్లలో మాత్రం ఆ స్థాయికి చేరుకోలేదు. బెంగళూరులో అత్యధికంగా 99860 రూపాయలకు చేరింది. మిగిలిన మార్కెట్లలో 98 నుంచి 99500 మధ్యలో ఉన్నాయి.
UPDATE 🚨: Gold officially breaks above $3,400 ounce for the first time in history,
— 🚨GlobalX (@GlobalXInt) April 21, 2025
With $22.871 TRILLION Market valuation.
Do you trust Gold more than any other asset ? pic.twitter.com/JFZYUIxBKU
అమెరికా ప్రభుత్వం చైనాకు ఎగుమతి నియమాలను కఠినతరం చేసిన తర్వాత పెరుగుతున్న వాణిజ్య యుద్ధం ఆందోళనలు పెరిగిపోయాయి. ఈ కారణంగానే బంగారం ధర రికార్డు స్థాయికి చేరుకుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Gold touches another All Time High on 1 Lakh this morning!!
— Gold Deals 🪙 (@GoldDealsIndia) April 21, 2025
Congratulations to all those buying and holding !!! 🚀🚀🚀 https://t.co/vcEkHq418L pic.twitter.com/pRGiSs6UXC
(Referring to Market Price for physical gold, MCX is usually lower - This is the price you'll find in Retail store when you go to purchase gold today)
— Gold Deals 🪙 (@GoldDealsIndia) April 21, 2025
ట్రంప్ సుంకాలు వేయడానికి కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. కీలకమైన ఖనిజాలపై సుంకాలు వేయడానికి అవసరమైన పరిశీ లన ట్రంప్ యంత్రాంగం ప్రారంభించింది. ఇది మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. బుధవారం చైనా నుండి వచ్చే చాలా వస్తువులపై సుంకాలను అమెరికా 245 శాతానికి పెంచింది. ఇది వాణిజ్య యుద్ధ భయాలను మరింతగా పెంచింది. US డాలర్ ఇండెక్స్ 100 మార్కు కంటే దిగువకు పడిపోవడంతో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.ఇక ముందు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
సమీప భవిష్యత్ లో గోల్డ్ ధరలు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపించడం లేదని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు . ట్రంప్ నిర్ణయాల వల్ల అనిశ్చితి కొనసాగుతుంది. అదే సమయంలో అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎంత డిమాండ్ పెరుగుతున్నా.. బంగారం గనుల్లో ఉత్పత్తి పెరగడం లేదు. ఈ కారణంగా .. పెద్ద ఎత్తున బంగారం రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి.





















