Hyundai Creta On Loan: రూ.లక్ష కడితే చాలు, రూ.11 లక్షల హ్యుందాయ్ క్రెటా మీ ఇంటికొస్తుంది
Hyundai Creta On EMI: హ్యుందాయ్ క్రెటా చవకైన వేరియంట్ ధర న్యూదిల్లీలో రూ. 11.11 లక్షలు. ఈ కారు కొనడానికి మీరు దాదాపు రూ. 10 లక్షల రుణం పొందవచ్చు.

Buying Hyundai Creta On Rs 1 Lakh Down Payment:స్టైల్‌గా, ప్రీమియం లుక్‌తో కనిపించే హ్యుందాయ్ క్రెటా కారును చాలా మంది భారతీయులు ఇష్టపడుతున్నారు. క్రిష్టల్ క్లియర్‌గా కనిపించే ఫ్రంట్ & విండో గ్లాసెస్, సన్‌రూఫ్‌తో ఉండే ఈ కారులో కూర్చుంటే, హెలికాప్టర్‌లో కూర్చున్న లగ్జరీ ఫీలింగ్ కలుగుతుంది. దిల్లీలో, హ్యుందాయ్ క్రెటా ఎక్స్ షోరూమ్ ధర (Hyundai Creta Ex-Showroom Price, Delhi) రూ. 11.11 లక్షల నుంచి ప్రారంభమై రూ. 20.50 లక్షల వరకు ఉంటుంది. మీరు ఈ కారును మీ ఇంటి ముందు పార్క్ చేయాలని ప్లాన్ చేసుకున్నప్పటికీ, తక్కువ బడ్జెట్ కారణంగా కొనలేకపోతే, మీ కోసం ఓ ఫైనాన్షియల్ ప్లాన్ చెబుతాం. ఈ ప్లాన్ ఫాలో అయితే హ్యుందాయ్ క్రెటా చవకైన పెట్రోల్ వేరియంట్ (బేస్ మోడల్)ను EMIపై మీ ఇంటికి తీసుకు వెళ్లవచ్చు, దాదాపుగా ఒక్క పూటలోనే కొత్త కార్ మీ ఇంటి ముందు ఉంటుంది.
మీరు, బ్యాంక్ నుంచి కార్ లోన్ తీసుకుని హ్యుందాయ్ క్రెటా బేస్ మోడల్‌ను కొనుగోలు చేయవచ్చు, ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని (EMI) చెల్లిస్తే సరిపోతుంది. EMIలు పూర్తిగా కాగానే హ్యుందాయ్ క్రెటాను పూర్తిగా మీ పేరు మీదకు మార్చుకోవచ్చు.
హ్యుందాయ్ క్రెటా కార్ కొనడానికి ఫైనాన్స్ ప్లాన్ (Finance plan to buy Hyundai Creta)
హ్యుందాయ్ క్రెటా ఎంత లోన్ అవసరం?
హ్యుందాయ్ క్రెటా బేస్ వేరియంట్ ధర (ఎక్స్ షోరూమ్) న్యూదిల్లీలో రూ. 11.11 లక్షలు. మీరు డౌన్ పేమెంట్‌గా రూ. 1 లక్ష డిపాజిట్ చేస్తే, మిగిలిన మొత్తం, దాదాపు రూ. 10 లక్షలు రుణం తీసుకోవాలి. ఈ రుణంపై బ్యాంక్ వసూలు చేసే వడ్డీ రేటు ప్రకారం, ప్రతి నెలా బ్యాంకులో EMI జమ చేయాలి.
ప్రతి నెలా ఎంత EMI చెల్లించాలి?
ఉదాహరణకు, హ్యుందాయ్ క్రెటా కార్ కొనడానికి మీరు తీసుకున్న రూ. 10 లక్షల కార్ లోన్ మీద బ్యాంక్ 9 శాతం వడ్డీ రేటు వసూలు చేస్తుందని భావిద్దాం. 7 సంవత్సరాల కాలానికి మీరు రుణం తీసుకుంటే, ప్రతి నెలా దాదాపు రూ. 16,089 ఈఎంఐని బ్యాంకుకు చెల్లించాలి. మీ నెలవారీ జీతం రూ. 50,000 అయితే ఈ కారు మీ బడ్జెట్‌లో రావచ్చు. ఈ ఏడేళ్ల కాలంలో (84 నెలలు) మొత్తం వడ్డీ రూ. 3,51,483 + రుణ మొత్తం రూ. 10,00,000 కలిపి మీరు మొత్తం రూ. 13,51,483 బ్యాంక్‌కు చెల్లిస్తారు.
హ్యుందాయ్ క్రెడా కొనడానికి మీరు 6 సంవత్సరాల కాల పరిమితితో రుణం తీసుకుంటే, 9 శాతం వడ్డీ రేటు ప్రకారం, ప్రతి నెలా దాదాపు రూ. 18,026 ఈఎంఐని రేటుతో బ్యాంకులో డిపాజిట్ చేయాలి. ఆరేళ్లు లేదా 72 నెలల్లో మొత్తం రూ. 2,97,839 వడ్డీ + అసలు రూ. 10,00,000 కలిపి మొత్తం రూ. 12,97,839 బ్యాంక్‌కు తిరిగి చెల్లిస్తారు.
హ్యుందాయ్ క్రెటా పెట్రోల్ వేరియంట్‌ను కొనుగోలు చేయడానికి 5 సంవత్సరాల పాటు రుణం తీసుకుంటే, 9 శాతం వడ్డీ రేటుతో, 60 నెలల పాటు (ఐదేళ్లు) ప్రతి నెలా రూ. 20,758 EMI పేమెంట్ చేయాలి. ఇలా మొత్తం రూ. 2,45,501 వడ్డీ + అసలు రూ. 10,00,000 కలిపి మొత్తం రూ. 12,45,501 బ్యాంక్‌కు చెల్లిస్తారు, ఇక్కడితో మీ లోన్ పూర్తిగా తీరిపోతుంది.
హ్యుందాయ్ క్రెటా మైలేజ్ (Hyundai Creta Mileage)
కంపెనీ లెక్క ప్రకారం, హ్యుందాయ్ క్రెటా పెట్రోల్ వెర్షన్ లీటరకు 18 కి.మీ. వరకు మైలేజ్ ఇస్తుంది. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 50 లీటర్లు. ఈ ప్రకారం, ట్యాంక్ ఫుల్ చేస్తే ఈ కారు 900 కి.మీ. రేంజ్ ఇస్తుంది.





















