50-25-25 Diet : 50-25-25 డైట్ ప్లాన్.. హెల్తీగా బరువు తగ్గాలంటే భోజనాన్ని ఇలానే చేయాలట
50-25-25 Diet Plan : ఆరోగ్యంగా ఉంటూ బరువు తగ్గాలంటే 50-25-25 డైట్‌ని ఫాలో అయిపోమంటున్నారు నిపుణులు. ఫుడ్‌ని శరీరానికి ఎలా అందించాలో ఇప్పుడు చూసేద్దాం.

Balanced Diet Plan for Weight Loss : భోజనం చేయడమంటే కడుపు నిండుగా తినడం కాదు.. శరీరానికి ఏవి ఏ మోతాదులో అందిస్తున్నామనేది ఇంపార్టెంట్ అంటున్నారు డైటీషియన్లు. ఆకలిని తీర్చి.. శరీరానికి ఎక్కువ కాలం శక్తిని ఇస్తూ.. బరువు పెరగకుండా, హెల్తీగా ఉండాలంటే 50-25-25 డైట్(50-25-25 Diet Plan)ని ఫాలో అవ్వాలని చెప్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్న భోజనమైనా.. రాత్రి భోజనమైనా ఈ పద్ధతిలోనే ఉండేలా చూసుకోవాలని అంటున్నారు. ఇంతకీ ఈ 50-25-25 డైట్ ఏంటో.. ఇది ఎలాంటి ప్రయోజనాలు అందిస్తుందో ఇప్పుడు చూసేద్దాం.
50-25-25 డైట్ ప్లాన్
సమతుల్యమైన ఆహారాన్ని శరీరానికి అందించే విధానాన్నే 50-25-25 డైట్ అంటారు. రోజువారీ భోజనంలో శరీరానికి కేలరీలు అందించేందుకు 50% కార్బ్స్, 25% ప్రోటీన్, 25% ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్ అందించడమే దీని లక్ష్యం. దీనిని బ్యాలెన్స్డ్ మీల్‌గా చెప్తారు. దీనిని ఫాలో అవ్వడం ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
50-25-25 డైట్ బెనిఫిట్స్
బరువు తగ్గాలనుకునేవారి ఇది బెస్ట్ డైట్ అవుతుంది. హెల్తీగా బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. శరీరానికి అవసరమైన కేలరీలు మాత్రమే ఈ డైట్లో తీసుకుంటారు. రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. 50-25-25 డైట్లో కార్బ్స్‌ని కంట్రోల్ చేయడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. ప్రోటీన్‌తో కూడిన ఆహారాన్ని, ఫైబర్‌ని తీసుకోవడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. చిరుతిళ్ల జోలికి వెళ్లరు.
50-25-25 డైట్ ప్లాన్ ఇలా ఉండాలి
50-25-25 డైట్‌ని ఫాలో అవ్వాలనుకుంటే.. బ్రేక్‌ఫాస్ట్ నుంచి డిన్నర్వరకు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.
బ్రేక్‌ఫాస్ట్
ఉదయాన్నే రెండు ఉడికించిన గుడ్లు తీసుకోవచ్చు. దీనిలో 140 కేలరీలు, 12గ్రాముల ప్రోటీన్, 10గ్రాముల హెల్తీ ఫ్యాట్ ఉంటుంది. ఒక కప్పు ఓట్మీల్ తినొచ్చు. దీనిలో 150 కేలరీలు, 30 గ్రాముల కార్బ్స్, 4 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. దానిలో బెర్రీలు కలిపి తినొచ్చు. వీటిని అరకప్పు తీసుకుంటే 60 కేలరీలు, 15 గ్రాముల హెల్తీ కార్బ్స్, 2 గ్రాముల ప్రోటీన్ అందుతుంది.
మధ్యాహ్న భోజనం
అన్నం కార్బ్స్ కాబట్టి.. దానిని మీరు హెల్తీ కార్బ్స్‌తో రిప్లేస్ చేయొచ్చు. క్వినోవా వంటివి తీసుకోవచ్చు. 1 కప్పు వండిన క్వినోవా తీసుకుంటే 150 కేలరీలు, 30 గ్రాముల కార్బ్స్, 4 గ్రాముల ప్రోటీన్ అందుతుంది. ఫైబర్ కోసం వెజిటెబుల్స్ తీసుకోవచ్చు. ఒక కప్పు బ్రకోలీని ఉడికించి తీసుకుంటే 55 కేలరీలు, 10 గ్రాముల కార్బ్స్, 2 గ్రాముల ప్రోటీన్ అందుతుంది. ప్రోటీన్ కోసం గ్రిల్డ్ చికెన్ బ్రెస్ట్ తీసుకుంటే 130 కేలరీలు, 25 గ్రాముల ప్రోటీన్, 3 గ్రాముల ఫ్యాట్ ఉంటాయి. మధ్యాహ్న భోజనం ఇలా బ్యాలెన్స్డ్గా ఉండేలా చూసుకోవాలి.
స్నాక్స్ సమయంలో
ఒక యాపిల్ తినొచ్చు. లేదా ఆల్మండ్స్ తినొచ్చు. యాపిల్‌లో 25 గ్రాములు కార్బ్స్ ఉంటాయి. ఇవి హెల్తీ. 95 కేలరీలు ఉంటాయి. ప్రోటీన్ ఉండదు. బాదంలో 6 గ్రాముల ప్రోటీన్, కార్బ్స్ 6 గ్రాములు, 161 కేలరీలు ఉంటాయి.
డిన్నర్
గ్రిల్ చేసిన చేపను తీసుకోవచ్చు. దీనిలో 180 కేలరీలు, 35 గ్రాముల ప్రోటీన్, 10 గ్రాముల ఫ్యాట్ ఉంటుంది. బ్రౌన్ రైస్ ఒక కప్పు తీసుకుంటే 110 కేలరీలు, 25 గ్రాముల కార్బ్స్, ప్రోటీన్ 2 గ్రాములు ఉంటాయి. పాలకూరను ఉడికించి తీసుకుంటే 1 కప్పులో 20 కేలరీలు, 3 గ్రాముల కార్బ్స్, 3 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
ఇలా కేలరీలు, ప్రోటీన్స్, కార్బ్స్, ఫైబర్ ఉండేలాగా ప్రతి మీల్ని ప్లాన్ చేసుకోవాలి. శరీరానికి సరిపడ కేలరీలు అందిస్తూనే హెల్తీగా ఫుడ్‌ని తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు హెల్తీగా ఉంటారు. ఈ డైట్లో మీరు ప్రాసెస్ చేయని ఫుడ్స్ అంటే కూరగాయాలు, ఫ్రూట్స్, గ్రైన్స్, పప్పులు, హెల్తీ ఫ్యాట్స్ తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నప్పుడు పోర్షన్ సైజ్ 50-25-25 ఉండేలా చూసుకోవాలి. హైడ్రేషన్కోసం నీటిని తాగుతూ ఉండాలి. ఈ డైట్‌ని ఫాలో అయ్యేప్పుడు నిపుణులు లేదా డాక్టర్ని సంప్రదించాలి. మీకు ఆరోగ్య సమస్యలు ఉంటే.. వైద్యులు మరిన్ని మార్పులు చేస్తారు.
Also Read : 6-6-6 వాకింగ్ రూల్ అంటే ఇదే.. ఈ రొటీన్ ఫాలో అయితే బరువు తగ్గడంతో పాటు మరెన్నో బెనిఫిట్స్
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.






















