హెల్త్ బెనిఫిట్స్ కోసం

మునగాకులను మీ డైట్​లో ఎలా చేర్చుకోవాలో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri

పోషకాలు ఇవే

మునగాకుల్లో విటమిన్ సి, విటమిన్ ఏ, కాల్షియం, ఐరన్, పొటాషియం ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి.

హెల్త్ బెనిఫిట్స్ కోసం

అందుకే వీటిని కొన్ని ఆహారాల్లో కలిపి లేదా.. విడిగా కూడా తీసుకోవచ్చు. మరి వీటిని ఎలా తీసుకోవచ్చో ఇప్పుడు చూసేద్దాం.

సూప్స్​లో

మీకు సూప్ తాగే అలవాటు ఉంటే.. మీరు ఎంచక్కా మునగాకులను వాటిలో వేసి తీసుకోవచ్చు.

పొడి చేసి

మునగాకులను ఎండబెట్టి పొడి చేసి.. స్మూతీలు, యోగర్ట్, ఓట్​మీల్​లో కలిపి తీసుకోవచ్చు.

సలాడ్స్​లో

హెల్తీగా ఉండేందుకు సలాడ్స్​ తింటారు. అలాంటివాటిలో వీటిని కూడా కలిపి తీసుకుంటే న్యూట్రిషన్స్ శరీరానికి అందుతాయి.

హెర్బల్ డ్రింక్

మీరు టీని మునగాకు టీతో కలిపి రిప్లేస్ చేయొచ్చు. వేడినీళల్లో మునగాకులు వేసి మరిగించి నిమ్మరసం పిండి కలిపి తాగొచ్చు.

బ్రెడ్​కి తోడుగా

మునగాకుల్లో వెల్లుల్లిని వేసి పేస్ట్ చేసి దానిలో నట్స్, ఆలివ్ ఆయిల్ కలిపి తీసుకోవచ్చు. దీనిని బ్రెడ్​పై కూడా పెట్టి తీసుకోవచ్చు.

ఫ్రైలలో

కూరగాయలను వేయించుకున్నప్పుడు లేదా ఫ్రైలలో వేసుకోవచ్చు. కొత్తిమీర లెక్క గార్నిష్ చేసుకోవచ్చు.

స్మూతీలలో

స్మూతీలు, జ్యూస్​లలో కూడా వీటిని వేసుకుని తీసుకోవచ్చు. కూరగాయల్లో కలిపి కూడా వీటిని జ్యూస్ చేసుకోవచ్చు.

అవగాహన

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు పాటిస్తే మంచిది. (Images Source : Envato)