స్నాక్స్‌గా పల్లీలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదట వీటిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్, విటమిన్ బి వంటి మినరల్స్ ఉంటాయి. మంచి రుచిని అందించడమే కాకుండా ఆరోగ్యానికి ఇవి ప్రయోజనాలు అందిస్తాయట. వేరుశనగల్లో ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాలకు బలాన్ని అందిస్తుంది. వీటిలోని హెల్తీ ఫ్యాట్స్ గుండె ఆరోగ్యానికి మంచివి. చెడు కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేస్తుంది. పల్లీల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాల హీనతను తగ్గిస్తాయి. వేడిని కంట్రోల్ చేస్తాయి. ప్రోటీన్, ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్ బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి. కడుపు నిండుగా చేసి ఎక్కువగా తినడాన్ని తగ్గిస్తాయి. విటమిన్ ఈ, ఫోలోట్, నియాసిన్ బ్రెయిన్ హెల్త్‌ని ప్రమోట్ చేస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. షుగర్ పేషంట్లు కూడా వీటిని ఇష్టంగా తినొచ్చు. ఇవి షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తాయి. ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది. (Image Source : Envato)