సైడ్ ఎఫెక్ట్స్ ఇవే

బాడీ లోషన్​ని ముఖానికి అప్లై చేస్తున్నారా?

Published by: Geddam Vijaya Madhuri

కేవలం బాడీకి మాత్రమే

బాడీ లోషన్.. పేరులోనే ఈ లోషన్ బాడీకి అని రాసి ఉంది. ఈ విషయం గుర్తించక కొందరు దీనిని ముఖానికి కూడా వాడేస్తుంటారు. వీటిని వాడడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయట.

ఆయిలినెస్

బాడీ లోషన్​ని ముఖానికి అప్లై చేస్తే ముఖంపై ఆయిలినెస్ పెరుగుతుంది. ముఖ్యంగా ఆయిలీస్కిన్ ఉన్నవాళ్లకి ఇది మరీ ఇబ్బందులు కలిగిస్తుంది.

బ్లాక్ హెడ్స్

ముక్కుపై బ్లాక్ హెడ్స్​ని బాడీలోషన్ పెంచుతుంది. ముఖంపై ఆయిల్ ఉంటే పింపుల్స్ సమస్య కూడా ఎక్కువ అవుతుంది.

ఇరిటేషన్

ముఖంపై స్కిన్ సెన్సిటివ్​గా ఉంటుంది. బాడీ లోషన్ ఉపయోగిస్తే ముఖంపై ఎరుపుదనం, ఇరిటేషన్​ని పెరుగుతుంది. దురద కూడా రావొచ్చు.

పింపుల్స్

మిమ్మల్ని పింపుల్స్ సమస్య వేధిస్తుందంటే.. బాడీలోషన్​ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. దీనివల్ల పింపుల్స్​ మరింత ఎక్కువ అవుతాయి.

డల్​నెస్

ముఖంపై బాడీలోషన్ అప్లై చేస్తే డల్​నెస్​ పెరుగుతుంది. సహజమైన మెరుపు తగ్గి మీరు డల్​గా కనిపిస్తారు.

హైడ్రేషన్

ముఖంపై pH బ్యాలెన్స్ మారిపోతుంది. దీనివల్ల ముఖం మరింత డల్​గా కనిపిస్తుంది. వైట్ ప్యాచ్​లు వచ్చే అవకాశముంది.

మానేస్తే..

ఇప్పటివరకు బాడీలోషన్​ అప్లై చేసి ఉంటే.. మీరు ముఖానికి ముల్తాని మట్టీతో ప్యాక్ వేసుకోవాలి. దీనివల్ల మీ గ్లో తిరిగి వస్తుంది.

ప్యాచ్ టెస్ట్

కొత్త ప్రొడెక్ట్స్ ముఖంపై ఉపయోగించేప్పుడు ప్యాచ్ టెస్ట్ వేసుకోండి దీనివల్ల ఇబ్బందులు ఉండవు.

అవగాహన కోసమే

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు పాటిస్తే మంచి ఫలితాలుంటాయి.