అన్వేషించండి

6-6-6 Walking Rule : 6-6-6 వాకింగ్ రూల్ అంటే ఇదే.. ఈ రొటీన్ ఫాలో అయితే బరువు తగ్గడంతో పాటు మరెన్నో బెనిఫిట్స్

Walking Rule : వాకింగ్ ప్రారంభించాలనుకుంటే మీరు 6-6-6 రూల్​ని ఫాలో అయిపోండి. దీనివల్ల టైమ్ కలిసిరావడంతో పాటు.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. 

6-6-6 Walking Rule Benefits : నడక వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. ఈ మధ్య దీనిపై ప్రజలు బాగా ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకే హెల్త్ బెనిఫిట్స్ కోసం ప్రతిరోజూ వాకింగ్ చేయాలని చూస్తున్నారు. అయితే మీరు కొత్తగా వాకింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే 6-6-6 రూల్​ని ఫాలో అయిపోండి. లేదా మీరు రెగ్యులర్​గా వాక్ చేసేవారు అయినా ఈ టెక్నిక్ ఫాలో అయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు.

6-6-6 వాకింగ్ రూల్ అంటే ఏమిటి?

వాకింగ్ చేయడానికి రూల్ ఏంటి? అసలు ఈ 6-6-6 రూల్ అర్థమేమిటి అని ఆలోచిస్తున్నారా? 6-6-6 వాకింగ్ రూల్ అంటే 60 నిమిషాల నడకను.. రెండు భాగాలుగా.. ఉదయం 6 గంటలకు, సాయంత్రం 6 గంటలకు పూర్తి చేయడం. ఇదే వాకింగ్​ రొటీన్​గా కంటీన్యూ చేయడం. అంతేకాకుండా వాకింగ్ తర్వాత మరో 6 నిమిషాలు శరీరాన్ని వార్మప్ చేసి మరో 6 నిమిషాలు రిలాక్స్ చేయాల్సి ఉంటుంది. ఈ రూల్​ని ఫాలో అవ్వడం వల్ల ఫిట్​గా ఉండడంతో పాటు హెల్త్​కి ఎన్నో ప్రయోజనాలు అందుతాయట. 

ఉదయం 6 గంటలకు నడిస్తే.. 

ది హార్ట్ ఫౌండేషన్​లోని ఓ అధ్యయనం ప్రకారం రోజూ 6 గంటలకు ఉదయాన్నే 30 నిమిషాలు నడిస్తే.. చాలామంచిదని తెలిపింది. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం 35 శాతం తగ్గుతుందని తెలిపింది. మార్నింగ్ వాకింగ్ చేయడం వల్ల జీవక్రియ మెరుగవుతుంది. రక్తప్రసరణ పెరుగుతుంది. ఈ రొటీన్​ వల్ల మీరు డే అంతా యాక్టివ్​గా ఉంటారు. 

సాయంత్రం 6 గంటలకు నడిస్తే.. 

డే అంతా కష్టపడి.. సాయంత్రం 6 గంటలకు అలా పార్క్​లో వాక్ చేస్తే మీకు విశ్రాంతి లభిస్తుంది. ఒత్తిడి దూరమవుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మెరుగైన నిద్ర మీ సొంతమవుతుంది. దీనిని ఓ రొటీన్​గా అలవాటు చేసుకుంటే నాణ్యమైన నిద్ర మీ సొంతమవుతుంది. దీనివల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. 

6 నిమిషాలు వార్మ్​-అప్

వాకింగ్ చేసేముందు నడకకు శరీరాన్ని సిద్ధం చేస్తూ వాకింగ్ చేయాలి. స్ట్రెచ్ చేస్తూ శరీరాన్ని వార్మ్​ అప్ చేయాలి. దీనివల్ల మెరుగైన రక్త ప్రసరణ అందుతుంది. నడుస్తున్నప్పుడు ఆయాసం లేకుండా చేస్తుంది. 

6 నిమిషాలు కూల్ డౌన్

వాకింగ్ చేసిన తర్వాత శరీరాన్ని రిలాక్స్ చేసేందుకు చిన్నగా స్ట్రెచ్​లు చేయాలి. దీనివల్ల శరీరం ఒత్తిడి గురికాకుండా.. నొప్పులు కంట్రోల్ అవుతాయి. వాకింగ్​కి ముందు, తర్వాత చేసే ఈ స్ట్రెచ్​లు ఫ్లెక్సిబులిటీని పెంచుతాయి. 

రోజుకు రెండుసార్లు వాక్ చేస్తూ 60 నిమిషాల నడకను పూర్తి చేయాలి. వార్మ్​ అప్, కూల్​ డౌన్ కచ్చితంగా ఫాలో అవ్వాలి. దీనిని రోజూ చేస్తూ ఉంటే ఆరోగ్యకరమైన జీవనశైలి మీకు అలవాటు అవుతుంది. ఈ రొటీన్​ వల్ల గుండె సమస్యలు తగ్గుతాయి. బరువు తగ్గడంలో హెల్ప్ అవుతుంది. బీపీ, షుగర్ కంట్రోల్ అవుతాయి. నిద్ర నాణ్యత పెరుగుతుంది. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. పూర్తిగా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. 

Also Read : బరువు తగ్గడానికి నడిస్తే మంచిదా? సైక్లింగ్ బెటరా? దేనివల్ల త్వరగా బరువు తగ్గుతారంటే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

High BP : బీపీ తగ్గాలంటే డైట్, లైఫ్‌స్టైల్​లో ఈ మార్పులు తప్పక పాటించండి.. నిపుణుల సూచనలు ఇవే
బీపీ తగ్గాలంటే డైట్, లైఫ్‌స్టైల్​లో ఈ మార్పులు తప్పక పాటించండి.. నిపుణుల సూచనలు ఇవే
Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget