అన్వేషించండి

AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది

AP Government Job Calendar 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 4 దశల్లో 10,060 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అనుమతినిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు 2026 జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఏపీ ప్రభుత్వం 10,060 ఉద్యోగాల భర్తీకి 2026 క్యాలెండర్ విడుదల.
  • మొదటి దశ 1,523 పోస్టులకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయింది.
  • సెప్టెంబర్ 15న రెండో దశ 3,231 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.
  • అక్టోబర్ 15న 5,306 పోస్టులకు మూడో, నాలుగో దశలు ప్రారంభం.

AP Job Calendar 2026 | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అనుమతి తెలుపుతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టులకు సంబంధించి 2026 జాబ్ క్యాలెండర్ ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా 4 వేర్వేరు దశల్లో పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదటి దశకు చెందిన 1,523 పోస్టులకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది.

రెండో దశలో 2,231 పోస్టుల భర్తీ

రెండో దశ నోటిఫికేషన్‌ను సెప్టెంబర్ 15న విడుదల చేయనున్నారు. ఈ విడతలో మొత్తం 3,231 పోస్టులను భర్తీ చేయనుండగా, ఇందులో ఏపీపీఎస్సీ గ్రూప్-1 విభాగానికి చెందిన 149 పోస్టులు ఉన్నాయి. అలాగే పోలీస్ శాఖలో భారీగా ఖాళీలను భర్తీ చేస్తారు. ఇందులో 542 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు, 182 సివిల్ సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టులు ఉన్నాయి.

మూడో దశలో 2,311 పోస్టులు

మూడో దశ నోటిఫికేషన్ అక్టోబర్ 15న విడుదల చేయనున్నారు. ఈ దశలో మొత్తం  2,311 పోస్టులను భర్తీ చేయనుండగా, అందులో గ్రూప్-2 కింద 673 పోస్టులు (200 డిప్యూటీ తహసీల్దార్ పోస్టులతో కలిపి) ఉన్నాయని తెలిపారు. దీనితో పాటు ఇంజినీరింగ్ మరియు ఇతర విభాగాల్లో 1,638 ఖాళీలను భర్తీ చేస్తారు.

నాలుగో దశలో 2,995 పోస్టులు భర్తీ

నాలుగో దశ నోటిఫికేషన్‌ను కూడా అక్టోబర్ 15నే విడుదల చేసి, మొత్తం 2,995 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో అత్యధికంగా స్కూల్ ఎడ్యుకేషన్ (పాఠశాల విద్య) విభాగంలోనే 2,991 పోస్టులు ఉంన్నాయి.

Also Read: AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!

పది వేల ఉద్యోగాల భర్తీ వివరాలు..
తొలి దశ: 1,523 పోస్టులు (ఉన్నత విద్యాశాఖ ద్వారా మే 15నే నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ ప్రక్రియ ప్రారంభించారు).

రెండో దశ: 3,231 పోస్టులు (సెప్టెంబర్ 15, 2026న నోటిఫికేషన్). గ్రూప్-1, పోలీస్, అటవీ, పశుసంవర్ధక శాఖల్లో భర్తీ చేయనున్నారు.

మూడో దశ: 2,311 పోస్టులు (అక్టోబర్ 15న నోటిఫికేషన్). గ్రూప్-2, ఎక్సైజ్, ఇంజినీరింగ్, విద్యుత్ శాఖల్లో భర్తీ చేయనున్నారు.

నాలుగో దశ: 2,995 పోస్టులు (అక్టోబర్ 15న డీఎస్సీ నోటిఫికేషన్). రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు.

Frequently Asked Questions

ఏపీ 2026 జాబ్ క్యాలెండర్ ద్వారా మొత్తం ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 జాబ్ క్యాలెండర్ ద్వారా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10,060 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది.

రెండో దశ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుంది? ఏయే శాఖల్లో పోస్టులు భర్తీ చేస్తారు?

రెండో దశ నోటిఫికేషన్ సెప్టెంబర్ 15న విడుదల చేయబడుతుంది. ఇందులో గ్రూప్-1, పోలీస్ (542 కానిస్టేబుల్, 182 ఎస్‌ఐ), అటవీ, పశుసంవర్ధక శాఖల్లో మొత్తం 3,231 పోస్టులు భర్తీ చేయనున్నారు.

మూడో దశ నోటిఫికేషన్ ఎప్పుడు? ఇందులో ఏ విభాగాల పోస్టులు ఉన్నాయి?

మూడో దశ నోటిఫికేషన్ అక్టోబర్ 15న విడుదల కానుంది. ఇందులో గ్రూప్-2 (673 పోస్టులు, 200 డిప్యూటీ తహసీల్దార్‌లతో కలిపి), ఇంజినీరింగ్, విద్యుత్ శాఖల్లో మొత్తం 2,311 ఖాళీలను భర్తీ చేస్తారు.

పాఠశాల విద్య విభాగంలో ఎన్ని పోస్టులు భర్తీ చేయనున్నారు? నోటిఫికేషన్ ఎప్పుడు?

నాలుగో దశలో భాగంగా పాఠశాల విద్య విభాగంలో అత్యధికంగా 2,991 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ కూడా అక్టోబర్ 15న డీఎస్సీ ద్వారా విడుదల అవుతుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget