నిద్రపోయేముందు వాకింగ్ చేస్తే ఎంత మంచిదో నడక ఆరోగ్యానికి మంచిదే. అయితే నిద్రపోయే ముందు నడిస్తే ఇంకా మంచిదట. పడుకునే ముందు నడిస్తే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు ఇప్పుడు చూసేద్దాం. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. మైండ్, శరీరం రిలాక్స్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. రెగ్యూలర్ వ్యాయామం, వాకింగ్‌తో నిద్ర నాణ్యత పెరిగి, ఎక్కువ సేపు నిద్రపోయేలా చేస్తుంది. జీర్ణ సమస్యలు దూరమవుతాయి. ఇవి నిద్రకు ఎలాంటి భంగం కలిగించవు. యాంగ్జైటీ, డిప్రెషన్‌ను దూరం చేసి.. మూడ్‌ని మెరుగుపరుస్తుంది. మెరుగైన రక్త ప్రసరణను అందించి.. డయాబెటిస్‌ను కంట్రోల్లో ఉంచుతుంంది. మెటబాలీజంను పెంచి.. బరువును కంట్రోల్ చేయడంలో సహాయం చేస్తుంది. ఇవి అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది. (Images Source : Getty)